వైద్య రంగంలో రోజు రోజుకీ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే అసాధ్యమైన ఆపరేషన్లను వైద్యులు సుసాధ్యం చేయించి చూపించారు. ఒకప్పుడు క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ అంటే వారి ప్రాణాలు పోయినట్లే అనే పరిస్థితి నుంచి పేషెంట్‌ని స్పృహలోనే ఉంచి సర్జరీ చేసే దాకా ఎదిగారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో జరిగిన అలాంటి ఆపరేషన్ వివరాలు వైరల్ గా మారాయి.
గాంధీ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలికి వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేశారు. అది కూడా ఆమె మేల్కొని ఉన్నప్పుడే ఆమెకు సినిమా చూపిస్తూ, ఆమెతో మాట్లాడుతూ ఆ సర్జరీ చేశారు. ఆ శస్త్ర చికిత్స సక్సెస్ కూడా అయ్యింది. ప్రస్తుతం ఆ బామ్మ గురించి న్యూస్ వైరల్ కావడంతో ఆ విషయం మెగాస్టార్ వరకూ చేరింది. అయితే ఆ బామ్మ వివరాలు కనుక్కోమని స్వయంగా చిరంజీవే తన పీఆర్వో ఆనంద్‌ను గాంధీకి పంపి వివరాలు సేకరించమని చెప్పారు.
ఎందుకు అలా చేశారంటే ఆ బామ్మ మెగాస్టార్ చిరంజీవి అభిమానంట. ఆమెకు సర్జరీ చేసే సమయంలో చిరంజీవి నటించిన ‘అడవి దొంగ’ సినిమానే చూసిందంట. గాంధీకి వెళ్లిన ఆనంద్ సూపరింటెండెంట్ రాజారావుని కలిసి వివరాలు సేకరించాడు. వృద్ధురాలికి వైద్యం చేసిన బృందాన్ని కూడా కలిసి మాట్లాడారు. ఆస్పత్రి నుంచే చిరంజీవికి ఫోన్ చేసి వివరాలు తెలిపాడు.
అయితే బామ్మ తన అభిమాని తెలుసుకున్న మెగాస్టార్.. ఆమెను స్వయంగా కలిసి ఆమెలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు నిర్ణయించుకున్నారు. రెండు మూడ్రోజుల్లో గాంధీని సందర్శిస్తానని.. బామ్మను కలుస్తానని చిరంజీవి మాటిచ్చారు. ఆనంద్ ఆ విషయాన్ని సూపిరంటెండెంట్ రాజారావు తెలియజేశారు.
అభిమానులను కలవడం, వారికి సహాయం మెగాస్టార్‌కు కొత్తేం కాదు. ఇటీవలే తన అభిమానికి క్యాన్సర్ సోకిందని ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. దొండపాడి చక్రధర్ మెగాస్టార్ అభిమాని. అంతేకాకుండా ఎంతోమంది పేదలు, దివ్యాంగులకు సహాయం చేశాడు. వారి కాళ్లమీద నిలబడేందుకు చేయూతనందించాడు. అలాంటి చక్రధర్‌కు క్యాన్సర్ సోకిందని తెలియగానే మెగాస్టార్ వెంటనే పిలిపించి ఆస్పత్రిలో చేర్పించారు. తన అభిమాని కోసం చిరంజీవి గాంధీ ఆస్పత్రికి వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.