మెగాస్టార్ చిరంజీవి.. తమ్ముడు పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సోమవారం హైదరాబాద్ లో ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరంజీవి పలు అంశాలపై స్పందించారు. ‘కొంతమంది అవసరాన్ని బట్టి తమ బుద్ధిని చూపిస్తుంటారు. నేను అలాంటి వాడిని కాదు ఎదుటివారి మంచి కోరుకునే వాడిని. ఎదుటివారికి కష్టం వస్తే సాయం చేయాలనుకుంటాను. ఈ సేవా కార్యాక్రమాలను ప్రారంభించే ముందు నా అభిమానులతో ఒకటే చెప్పాను. నా పిలుపు మేరకు అభిమానులు ముందుకొస్తే నా స్పందన వారిలో వ్యక్తమైందని భావిస్తాను’ అన్నారు.
తమ్ముడు పవన్ కల్యాణ్ పై కూడా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కల్యాణ్ బాబు ఏ విషయంపై స్పందించినా కూడా సబబుగానే ఉంటుంది. కొన్నిసార్లు కల్యాణ్ స్పందన చూస్తే సమంజసంగానే అనిపిస్తుంటుంది. పవన్ ఎప్పుడూ న్యాయం కోసమే మాట్లాడతాడు. నేనూ న్యాయం కోసమే వాదిస్తాను. కాకపోతే పవన్ తర్వగా స్పందిస్తాడు.. నేను కొంచం సమయం తీసుకుంటాను’ అంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో చాలా అంశాలకు అన్వయించుకోవచ్చు. అందుకే ఇప్పుడు చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.