పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి, రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కామన్ పీపుల్ మాత్రమే కాకుండా, సెలబ్రెటీస్ కూడా పవన్ ఫాలోవర్స్ గా ఉండటానికి ఇష్టపడుతుంటారు. అలాంటి పవర్ స్టార్ పుట్టినరోజు అంటే హంగామా మాములుగా ఉంటుందా? సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. తమ హీరోకి బర్త్ డే విషెస్ అందిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తమ విషెస్ అందిస్తున్నారు. అయితే.., ఎంత మంది ఫ్యాన్స్, సెలబ్రెటీలు విష్ చేసినా.. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అందించిన బర్త్ డే విషెస్ మాత్రం స్పెషల్ గా నిలవడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు. “చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్.. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ ట్వీట్ పవన్ పై చిరుకి ఉన్న ప్రేమని, నమ్మకాన్ని తెలియ చేసేలా ఉండటం విశేషం. దీంతో.. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. మీరు కూడా కామెంట్స్ రూపంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి.
చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్ @PawanKalyan
అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. pic.twitter.com/PWAbNmvpAu— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2021