సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్ని, తీపి గుర్తులుగా మిగిల్చి దివికేగారు. ఆయన మరణానికి నివాళి అర్పిస్తూ, తెలుగు చిత్రసీమలో సెలబ్రిటీలు అందరూ ట్వీట్స్ పెడుతున్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణకి సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి చెందినదే కృష్ణ-చిరంజీవి బాండింగ్. అందుకు సంబంధించిన ఓ పాంప్లెట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సినిమా స్థాయిని పెంచిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఎందుకంటే ఓ సాధారణ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి, హీరోగా మారారు. ఆ తర్వాత దర్శకుడు, నిర్మాత, ఎడిటర్, రైటర్.. ఇలా అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇక కృష్ణ గురించి చెప్పాలంటే తన దగ్గరికి వచ్చిన వారికి లేదనకుండా సాయం చేసేవారు. అందుకు సూపర్ స్టార్ కృష్ణకు ఫ్యాన్స్ కోట్లలో ఉండేవారు. ఒకప్పుడు ఆయనకు ఏకంగా 2500 అభిమాన సంఘాలు ఉండేవి. మనకు తెలిసినంత వరకు ఈ రేంజ్ లో ఓ హీరోగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండటం నిజంగా మెచ్చుకోదగిన విషయం. అప్పట్లో కృష్ణ పుట్టినరోజు వచ్చిందంటే చాలు , ఫ్యాన్స్ అందరూ పండగలా సెలబ్రేట్ చేసుకునేవారు.
ఇక వరసగా 14 ఫ్లాప్స్ ఎదురైనప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ‘అల్లూరి సీతారామరాజు’ మూవీని హిట్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకే దక్కుతుంది. ఇక కృష్ణ సినిమాలు చేయడం తగ్గించేసిన తర్వాత అంటే 2008లో ఈ అభిమాన సంఘాలన్నీ కూడా దాదాపు కలిసిపోయాయి. ఇదిలా ఉండగా కృష్ణకు స్టార్ హీరోలు కూడా డైహార్డ్ ఫ్యాన్సే. ఇప్పుడు మెగాస్టార్ గా కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న చిరంజీవి కూడా కృష్ణకు వీరాభిమాని. అప్పట్లో పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అభిమాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి చాలా ఏళ్ల పాటు ప్రెసిడెంట్ గానూ పనిచేశారు. ‘తోడు దొంగలు’ ప్రమోషన్ లో భాగంగా ఈ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో ఓ పాంప్లెట్ రిలీజ్ చేశారు. అదే ఇప్పుడు వైరల్ గా మారింది. ఇకపోతే ఇదే సినిమాలో కృష్ణతో పాటు చిరంజీవి కూడా యాక్ట్ చేయడం విశేషం. మరి కృష్ణ-చిరంజీవి బాండింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 15, 2022