తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి దేశభక్తి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలో స్టార్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటిస్తున్నారు. చిరు చేతికి స్వల్ప గాయం అవడంతో స్మాల్ సర్జరీ జరిగింది. దాంతో షూటింగ్ కి కొంత విరామం ఏర్పడింది. రాజా దర్శకత్వంలో ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి మరో రెండు చిత్రాలను పైప్ లైన్ లో పెట్టారు. ఒకటి కె యస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రం.. స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భోళా శంకర్ ఒకటి. తమిళ హిట్ మూవీ తెలుగు రీమేక్ గా నిర్మిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భోళా శంకర్ చిత్రం సెట్స్ పైకి వెళ్ళడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 11 అంటే 11.11.21 న ఉదయం 7.45 నిమిషాలకు భోళా శంకర్ మూవీ పూజ కార్యక్రమాలతో మొదలు కాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా భోళా శంకర్ రెగ్యులర్ షూట్ కి వెళ్లే డేట్ కూడా లాక్ చేసేసారు. అది నవంబర్ 15 నుండి భోళా శంకర్ సినిమా అఫీషియల్ గా రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్లుగా ప్రకటించారు. పవర్ ఫుల్ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా మెహర్ రమేష్ ఈ సినిమాని రూపొందించనున్నారు.. ఇప్పటివరకూ చూడని సరికొత్త క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ తో మెగాస్టార్ చిరంజీవి ని సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే ఈ చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తుంది. దీనికి సంబంధించి ఇటీవల కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. మొత్తానికి భోళా శంకర్ మూవీపై తాజా అప్డేట్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది.
The Auspicious Day is Set for the MEGA LAUNCH ✨
MEGA 🌟 @KChiruTweets – @MeherRamesh Film #BholaaShankar 🔱 Muhurtam Ceremony will be held on 11-11-21, 7:45AM 🎬
Mega Shoot Begins from 15-11-21🎥@KeerthyOfficial @AnilSunkara1 #MahatiSwaraSagar @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/6GuN6Zkqez
— AK Entertainments (@AKentsOfficial) October 27, 2021