టాలీవుడ్ సెలబ్రిటీలలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిత్రపరిశ్రమలో స్టార్ యాక్టర్ గానే కాకుండా ఓ మంచి ఫ్యామిలీమ్యాన్గా, మెగాఫ్యాన్స్ కి అభిమాన తారగా వెలుగుతున్నారు. అయితే.. సోషల్ మీడియా అనేది అటు సినీ నటులకు, అభిమానులకు మధ్య వారధిలా పనిచేస్తోంది. 2020 కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మెగాస్టార్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మెగాఫ్యాన్స్ ఫేవరేట్ ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గతంలో ‘బ్రదర్స్ డే’ సందర్భంగా మెగాస్టార్ చిరు ట్విట్టర్ వేదికగా.. చిన్ననాటి త్రోబ్యాక్ పిక్ పోస్ట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో చిరంజీవి.. నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉన్నారు. అయితే.. మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ని ఎత్తుకొని ఉండగా, పక్కనే నాగబాబు నిలబడి ఉండటం మనం చూడవచ్చు. మెగా బ్రదర్స్ అన్యోన్యానికి ఈ పిక్ సాక్ష్యంగా నిలుస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ మెగా పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి,
Happy Brothers day! pic.twitter.com/X6kmJKTo3P— Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2021