రాజకీయ ఎన్నికలను గుర్తు చేస్తూ.. విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎంతో ఉత్కంఠగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఘనవిజయం సాధించారు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ యువకుడైన విష్ణు విజయం సాధించడం విశేషం. దీంతో.. మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి సినీ పెద్దలను కలుస్తూ.. మద్దతు కూడగడుతూ తనదైన స్టైల్లో దూసుకెళ్లి విష్ణు అద్భుత విజయం అందుకున్నారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. వయసులో చాలా మంది కంటే చిన్నవాడినైనా తనకు సినీ కళామాతల్లికి సేవ చేసే భాగ్యం కల్పించిన సినీ పెద్దలకు, ప్రతి ఒక్క ‘మా’ మెంబర్కు మనస్పుర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. కాగా.. ఓటమి పాలైన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు, మద్దతుదారులు నిరాశలో మునిగిపోయారు. త్వరలో ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకోసం భారీ సభ ఏర్పాటు చేసి ఇండస్ట్రీలోని సినీ పెద్దలందరినీ ఆహ్వానించి పెద్ద ఎత్తున ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమచారం. మరి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.