సాధారణంగా ఇండస్ట్రీలో నటీ, నటుల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. బిజీ షెడ్యూల్ కారణంగా వారు తరచుగా కలుసుకోకపోవచ్చు. కానీ వారు కూడా మనలాగే చాటింగ్ లు ఫోన్ లు చేసుకుంటారా? అన్న అనుమానాలు చాలా మంది అభిమానుల్లో ఉంటాయి. ఇద్దరు సెలబ్రిటీస్ మధ్యలో జరిగే ఫోన్, చాటింగ్ సంభాషణలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని సగటు అభిమానులు ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే హీరో మంచు మనోజ్-వెన్నెల కిశోర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు మనోజ్. వీరిద్దరి మధ్య జరిగిన చాటింగ్ అభిమానుల్లో నవ్వులు పూయిస్తోంది.
మంచు మనోజ్.. మంచు ఫ్యామిలీ నుంచి మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభించిన కొద్ది కాలంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమాలు చేసి కెరీర్ లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే 2017లో వచ్చిన “ఒక్కడు మిగిలాడు” సినిమా ఫ్లాప్ అయితే.. సినిమాలు తీయడం మానేస్తాను అనే స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ మూవీ కథ అద్బుతంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో అదే స్టేట్ మెంట్ పై ఉన్నాడు మనోజ్. అయితే ఆ మధ్యలో “అహం బ్రహ్మాస్మీ” అనే సినిమాను ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దాంతో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు మనోజ్.
కానీ సోషల్ మీడియాలో మాత్రం కొంత వరకు యాక్టీవ్ గా ఉంటూ.. అప్పుడప్పుడు పోస్ట్ లు షేర్ చేస్తుంటాడు మనోజ్. ఈ క్రమంలోనే తాజాగా తనకు ప్రముఖ కమెడీయన్ వెన్నెల కిశోర్ కు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ను స్క్రీన్ షాట్స్ తీసి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ చాటింగ్ లో కొంత తెలుగు, కొంత హిందీ, ఇంగ్లీష్ బాషలు కలిపి ఉన్నాయి. “నాది ఆగ్రాలో ఉంది.. నీది ఎక్కడ ఉంది” అని వెన్నెల కిశోర్ అడగ్గా.. మనోజ్ రిప్లై ఇస్తూ.. నాది హైదరాబాద్ లో ఉంది అని చెప్పుకొచ్చాడు. ‘హైదరాబాద్ లో నీది నాది కలుస్తుంది’ అంటూ ఇద్దరు కలిసి చేసుకున్న చాటింగ్ చూసిన అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. మచ్చా మనిద్దరి కాంబో త్వరలోనే ఉందని వారికి చెప్దాం. అప్పుడు మనది వారిది సంతోషిస్తుంది అని రాసుకొచ్చాడు మనోజ్. ప్రస్తుతం మనోజ్ షేర్ చేసిన ఈ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Mine and my machaaa @vennelakishore WhatsApp chat be like ….. 😂 …. Machaaa Needhi Naadhi combo twaralo andhiri dhanki chepdham. Appudu manadhi valladhi happy ga untadhi ❤️😂 pic.twitter.com/fKvf8WGLRr
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 18, 2022