మంచు సోదరులు మధ్య అసలేం జరుగుతుంది.. అన్నదమ్ములిద్దరూ విడిపోయారా? ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారా?.. ఇద్దరికి పడటం లేదా?.. అనే సందేహాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే వారిద్దమ మధ్య వివాదం జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై తాజాగా మంచు మనోజ్ స్పందించారు.
మంచు కుటుంబంలో విభేదాలు తెర మీదకు వచ్చాయి. మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్‌ల మధ్య సంబంధాలు సరిగా లేవని కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అందుకు బలం చేకూర్చేలా మనోజ్ రెండో వివాహం సందర్భంగా కూడా మంచు విష్ణు ఏదో చుట్టపు చూపుగా వచ్చి.. కాసేపు ఉండి వెళ్లి పోయాడు. ఇక రెండు మూడేళ్లుగా వీరిద్దరూ కనీసం బర్త్‌డే విషేస్ కూడా చెప్పుకోవడం లేదు. మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కూడా వీరిద్దరూ దూరంగానే ఉన్నారు. ఇటీవలే రెండు రోజుల క్రితం ఓ వివాదంతో మరోసారి మంచు సోదరులు వార్తల్లో నిలిచారు. ఈ వివాదంపై ఇప్పటికే మంచు మోహన్ బాబు, విష్ణులు స్పందించారు. తాజాగా ఈ వివాదం మంచు మనోజ్ స్పందించారు. ఆ వివాదంపై మీడియానే చెప్పాలని ఆయన తెలిపారు. అంతేకాక పలు ఆసక్తకిర విషయాలు తెలిపారు.
రెండు రోజుల క్రితం మంచు విష్ణు.. తన ఇంటి మీదకు వచ్చి.. దాడి చేస్తున్న వీడియోని మనోజ్ స్టేటస్‌గా పెట్టడంతో.. కొత్త వివాదం విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో విష్ణు.. ఎవరి ఇంటికో వెళ్లి వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు విష్ణును ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వారి పక్కన ఉన్న గదిలో ఎవరో ఉన్నారని.. వారు బయటకు రాకుండా గడి వేయడంతో.. వారు డోర్‌ను తంతున్నారు. ఇక వీడియో చివర్లో.. మనోజ్.. ఇలా తరచుగా మా ఇంటికి వచ్చి గొడవ చేయడం అలవాటు అయ్యింది అనడం వినిపిస్తోంది.
ఈ వివాదంపై మంచు మోహన్ బాబు చాలా సీరియస్ అయ్యారు. ఇద్దరి కుమారులను గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. తాజాగా ఈ వివాదంపై మంచు మనోజ్ కూడా స్పందించారు. తాను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివాదంపై మీడియానే చెప్పాలని మంచు మనోజ్ అన్నారు. ఈ వివాదంపై తనను అడగొద్దని, తన అన్ననే అడగండి అంటూ మంచు మనోజ్ అన్నట్లు సమాచారం. మరి.. మంచు బ్రదర్స్ మధ్య వివాదంపై మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.