New getup : సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండే అతి కొద్ది మందిలో మంచు లక్ష్మి ఒకరు. తనకు, ఫ్యామిలికీ సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా, మార్చి 27న ప్రపంప రంగస్థల దినోత్సవం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ఆమె వేషధారణ చాలా కొత్తగా.. వింతగా.. నవ్వు తెప్పించేదిలా ఉంది. బాగా లావుగా కనిపించేలా బ్లాక్ డ్రెస్ ధరించి, చైనీస్ కనుబొమ్మలతో.. చేతిలో బెత్తంతో సీరియస్ లుక్‌లో చాలా ఫన్నీగా కనిపించారు. ఆ ఫొటోలో బెత్తంతో ఓ స్కూలు చిన్నారిని భయపెడతున్నారు. అయితే, ఆ పాప నవ్వుతూ ఉంది.
ఫొటో కింద మంచు లక్ష్మి ‘‘ నేను థియేటర్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాను. స్టేజీ(రంగస్థలం)నే ఎప్పటికీ నా ఫస్ట్ లవ్. తెర కిందకు పడితే వచ్చే సంతోషం దేంట్లోనూ రాదు. హ్యూమన్ ఆర్ట్స్లో రంగస్థలానిది గొప్ప స్థానం. అక్కడ నవ్వొచ్చు.. ఏడ్వచ్చు.. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవచ్చు. యాక్టింగ్ కెరీర్‌లోని మొదటి రోజులు రంగస్థలంతో మొదలవ్వటం ఎంతో గర్వంగా ఉంది. రంగస్థల ప్రేమికులు అందరీకీ ‘‘హ్యాపీ వరల్డ్స్ థియేటర్‌డే’’ అని రాసుకొచ్చారు. మంచు లక్ష్మి గెటప్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మహేష్ బాబు చేయాల్సిన జనగణమన విజయ్ దేవరకొండ ఖాతాలోకి!