జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ కే కాదు, భారతీయ చలన చిత్ర పరిశ్రమకి దొరికిన మేలిమి బంగారం అన్న విషయం ఆర్ఆర్ఆర్ సినిమా చూశాక రుజువైంది. తారక్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ నటనకు ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రముఖ రాజకీయ ప్రముఖులు సైతం ప్రత్యేకించి ఎన్టీఆర్ ని కలిసి మరీ అభినందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా హైదరాబాద్ వచ్చి మరీ ఎన్టీఆర్ ని కలిసి అభినందించారు. అది ఎన్టీఆర్ స్థాయి అని అభిమానులు మురిసిపోతారు. అంతలా భీమ్ పాత్ర ప్రభావం అందరి మీద పడింది. అలాంటి తారక్ కి వెరైటీ మ్యాగజైన్ టాప్ 10 బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్స్ ఫర్ ఆస్కార్స్ రేస్ లో తారక్ 10వ స్థానంలో ఉన్నారన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
దీంతో ఎన్టీఆర్ అభిమానులు, పలు మీడియా ఛానళ్లు ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఆస్కార్ ప్రిడిక్షన్స్ లో టాప్ 10 ప్లేస్ లో నిలిచిన మొదటి నటుడు తారక్ అని ప్రశంసిస్తున్నారు. అయితే సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు మాత్రం ఈ విషయంపై పెద్దగా స్పందించడం లేదు. కొంతమంది స్పందించినప్పటికీ.. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో మంచు లక్ష్మి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎందుకు మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ సాధించిన ఘనత చిన్న విషయమేమీ కాదు. తారక్ సాధించిన ఈ ఘనతకు మీ నుంచి విజిల్స్, చప్పట్లు రావాలి’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన అభిమానులు.. నిజమే కదా.. తారక్ సాధించిన ఘనత చిన్న విషయం ఏమీ కాదు. ఏ నటుడికీ సాధ్యం కానటువంటి అరుదైన ఫీట్ ని సాధించారు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం అని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచినటువంటి వ్యక్తుల్లో తారక్ ఉండడం.. ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశం ఉండడం నిజంగా గొప్ప విషయం అని.. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం వేడుకలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం అని అంటున్నారు. మరి వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ వచ్చే అవకాశం ఉన్న నటుల జాబితాను అంచనా వేసి తారక్ పేరు ప్రచురించడంపై మీ అభిప్రాయం ఏమిటి? తారక్ సాధించిన ఈ అరుదైన ఘనతను తెలుగు సినీ పరిశ్రమ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం లేదని మంచు లక్ష్మి ప్రశ్నించిన తీరుపై మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి.
Why aren’t we celebrating this more y’all! This is no small feat in the world of cinema. @tarak9999 whistles, claps and may more creative juices flow through you. 🥳🥳🥳🥳🥳🥳 https://t.co/wvyoxnLh8Q
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 6, 2023