సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఒక్కసారి విజయం సాధించామా.. నెత్తిన పెట్టుకుంటుంది. లేదంటే.. ఎన్నో వేధింపులు, ఇబ్బందులు. ఇక అవకాశాల కోసం ఎదురు చూసే వారికి, ముఖ్యంగా మహిళలకు ఇండస్ట్రీలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీటూ ఉద్యమం ఫలితంగా ఇండస్ట్రీలో తాము ఎలాంటి వేధింపులకు గురయ్యారో.. బాధితులు వెల్లడించారు. అయితే బ్యాంగ్రౌండ్ ఉన్న వారికి ఇలాంటి వేధింపులు ఉండవు అనుకుంటే పొరపాటే అంటున్నారు నటి మంచు లక్ష్మీ. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి వెల్లడించారు.
ఇది కూడా చదవండి : నెరవేరబోతున్న మంచు లక్ష్మీ కల.. ఎమోషనల్ ట్వీట్!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జాతీయ మీడియాతో మంచు లక్ష్మీ ముచ్చటించారు. తాను కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాని తెలిపింది. తాను మోహన్ బాబు కూతురిని, సినిమా ప్రపంచంలోనే పుట్టి పెరిగాను కదా.. కాస్టింగ్ కౌచ్ ఎందుకు ఎదురువుతుందని అనుకున్నాను.. కానీ తనకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు. అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే లేదని.. అన్ని రంగాల్లో ఉందని మంచు లక్ష్మీ తెలిపారు. వేర్వేరు రంగాల్లో పని చేస్తున్న తన స్నేహితులు కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఇక బాడీ షేమింగ్, ట్రోల్స్‌కి అయితే లెక్కేలేదని తెలిపారు. మరీ ముఖ్యంగా సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న తమ లాంటి వారికి ఇవి ఎక్కువన్నారు. ఏం చేసినా ట్రోల్ చేస్తారని తెలిపారు. వాటిని పట్టించుకోకుండా.. మనకు నచ్చినట్టుగా ఉండాలని.. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి అని మంచు లక్ష్మీ తెలిపారు. మనిషి జీవితం చాలా చిన్నదని.. ఎప్పుడు ఏం అవుతుందో తెలియదు కాబట్టి.. అనుకున్నవి అన్ని చేసేయ్యాలని.. కోరుకున్నది సాధించాలి.. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి అని తెలిపారు. ఈ ట్రోలింగ్, క్యాస్టింగ్ కౌచ్.. ఇవేవీ కూడా మనల్ని ఆపకూడదు. మనం చేయాలనుకున్నది చేయాలి.. సాధించాలనుకున్నది సాధించాలి అంటూ మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం మంచు లక్ష్మీ తమిళం, మళయాలంలో నటిస్తోంది. మళయాలంలో మోహన్ లాల్ హీరోగా వస్తోన్న మాన్స్టర్ సినిమాలో నటిస్తోంది. ఇక తమిళ సినిమా కోసం మంచు లక్ష్మీ పోలీస్ ఆఫీసర్‌గా మారింది. మంచు లక్ష్మీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.