మెగాస్టార్ చిరంజీవి మెనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని ఎడమకంటికి, చాతిపైన బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకున్నాడని, అతని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.
ఇక సాయిధరమ్ ప్రమాదానికి గురికావటంతో టాలీవుడ్ లోని ప్రముఖ నటులందరూ స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోరుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు. తాజాగా మంచు మోహన్ బాబు కుమార్తే లక్ష్మి సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అందరూ ఆయనపై చేస్తున్న పుకార్లను వెంటనే ఆపాలని తెలిపింది. నాకు తెలిసిన వ్యక్తుల్లో బాధ్యత గల పౌరుడు సాయిధరమ్ తేజ్ అని, ఆయన వేగంగా బైక్ నడపలేదని స్పష్టంగా అర్ధమవుతోందని తెలిపింది. అక్కడున్న ఇసుక, బురద కారణంగానే సాయి ప్రమాదానికి గురయ్యాడని మంచు లక్ష్మి అన్నారు. ఇకనైన అతనిపై అనవసరమైన పుకార్లు చేయోద్దని ఆమె అన్నారు.