సినీ ఇండస్ట్రీలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. పాన్ ఇండియా నటుడిగా ఆయనకు ఎంతో గొప్ప పేరు ఉంది. తెలుగు లో ఆయన నటించిన చిత్రాలు కొన్నే అయినా.. టాలీవుడ్ లో కూడా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
సూపర్ స్టార్ మోహన్ లాల్ మాలీవుడ్ లోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస విజయాలు అందుకుంటున్నారు మోహన్ లాల్. గత కొంత కాలంగా మోహన్ లాల్ కి ఓ కేసు విషయం తలనొప్పిగా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తన ఇంట్లో రెండు ఏనుగు దంతాలను పెట్టుకోవడంతో వన్యప్రాణుల రక్షణ చట్టం నిబంధనల ప్రకారం మోహన్ లాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ కేసు విషయంపై మోహన్ లాల్ కోర్టులో వివరణ ఇచ్చారు. ఏనుగు దంతాల కేసు విషయంలో మోహన్ లాల్ కి కోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.. వివరాల్లోకి వెళితే..
మాలీవుడ్ లో సూపర్ స్టార్ గా గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మోహన్ లాల్ కి కొంత కాలంగా ఓ కేసు కొరకరాని కొయ్యలా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఇంట్లో రెండు ఏనుగు దంతాలు ఉండటపై వన్యప్రాణుల చట్టం ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాను చట్టప్రకారం అన్ని రకాల అనుమతులు తీసుకొని ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నానని మోహన్ లాల్ కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై కూడా మరోసారి విచారణ జరిపించాలని కేరళా హైకోర్టు మెజిస్ట్రేట్ ని కోరింది.
తాను ఎటువంటి తప్పు చేయలేదని.. పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ మోహన్ లాల్ చేసిన పిటీషన్ ని కేరళా హైకోర్టు బుధవారం కొట్టివేసింది. గతంలో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు ఏనుగు దంతాలు గుర్తించారు. దాంతో మోహన్ లాల్ పై వన్యప్రాణుల చట్టం ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు.
ఆనాటి నుంచి మోహన్ లాల్ తాను ఏనుగు దంతాలు చట్టబద్దంగానే తీసుకున్నానని కోర్టుకు విన్నవించుకుంటూనే ఉన్నారు. కానీ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న ఇమేజ్ కి ఈ కేసు ఒక తలనొప్పిగా మారిందని సన్నిహితులు అంటున్నారు. ఈ కేసు విషయంలో మరోసారి మోహన్ లాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే మోహన్ లాల్ ని వెంటాడుతున్న ఈ కేసు విషయంలో ఆయన అభిమానులు సైతం కంగారు పడుతున్నారు. మోహన్ లాల్ కేసు విషయమై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.