గత ఐదారేళ్లుగా చూస్తే.. తీర్పుల వెలువరించే తీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రశంసనీయంగా ఉంటే.. కొన్ని వివాదాస్పదమౌతున్నాయి. బాబ్రీ మసీదు, అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశం నుండి ఇటీవల వ్యభిచారంపై ఇచ్చిన తీర్పు వరకు పలు అంశాలున్నాయి.
ఇటీవల న్యాయ వ్యవస్థ ఇస్తున్న తీర్పుల్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. గత ఐదారేళ్లుగా చూస్తే.. తీర్పుల వెలువరించే తీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రశంసనీయంగా ఉంటే.. కొన్ని వివాదాస్పదమౌతున్నాయి. బాబ్రీ మసీదు, అయ్యప్ప స్వామి దేవాలయంలోకి మహిళల ప్రవేశం నుండి ఇటీవల వ్యభిచారంపై ఇచ్చిన తీర్పు వరకు పలు అంశాలున్నాయి. అలాగే పౌరుల వ్యక్తిగతకు సంబంధించిన తీర్పుల్లోనూ సంచల తీర్పులు వచ్చాయి. అందులో ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే సహజీవనం చేయొచ్చు అంటూనే.. భార్యా భర్తలు కలిసి ఉండలేమనప్పుడు ఆరు నెలల వ్యవధి లేకుండా విడాకులు ఇచ్చేయొచ్చునని పేర్కొంది. ఇప్పుడు మరో కేసులో సంచలన తీర్పునిచ్చింది.
తన పిల్లలకు పెయింటింగ్ వేసుకునేందుకు తన శరీరాన్ని అర్థనగ్నంగా మార్చిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ‘ఒక మహిళ తన శరీరం గురించి స్వయంప్రతిపత్తి నిర్ణయాలు తీసుకునే హక్కు.. ప్రాథమిక హక్కులో భాగమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన స్వేచ్ఛాయుత హక్కు కిందకు వర్తిస్తుంది’అని కోర్టు పేర్కొంది. ఫాతిమా తన శరీరాన్ని పిల్లలకు కాన్వాస్ గా ఉపయోగించిందే తప్ప.. దాన్ని లైంగిక చర్యగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. మహిళ పై భాగం అచ్చాదన స్థితిలో ఉంటే లైంగిక పరమైన వాంఛ తీర్చుకునేందుకు అన్న సమాజం చూస్తున్న తీరు అన్యాయం, వివక్షతో కూడుకున్నదని పేర్కొంది.
అసలు ఏమైందంటే..? కేరళకు చెందిన రెహానా ఫాతిమా తన శరీరంలోని పై భాగాన్ని వివస్త్రగా చేసుకుని.. తన కుమారుడు, కుమార్తెకు పెయింటింగ్ వేసుకునేందుకు కాన్వాస్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో ఫాతిమాపై పోక్సో, జువెనైల్ జస్టిస్, ఇన్ఫ్మర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసును చేపట్టేందుకు ట్రయల్ కోర్టు అంగీకరించడకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన జస్టిస్ కౌసర్ ఎడగప్పత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆమెకు ఊరట కల్పిస్తూ తీర్పునిచ్చింది. అయితే ప్రాకిక్యూషన్ వాదనలు వేరోలా ఉన్నాయి. అలా బహిర్గతం చేయడం అసభ్యకరమైనదీ, అశ్లీలమైనదని వాదించింది.
ఈ వాదనను తోసిపుచ్చిన కోర్టు, ‘నగ్నత్వం, అశ్లీలత ఎల్లప్పుడూ రెండు ఒక్కటి కావు’ అని పేర్కొంది. ‘నగ్నత్వాన్ని అశ్లీలత లేదా అసభ్యకరంగా లేదా అనైతికంగా వర్గీకరించడం తప్పు’ అని తెలిపింది. లైంగిక సంతృప్తి కోసం లేదా లైంగిక ఉద్దేశ్యంతో ఈ చర్య జరిగిందని చెప్పలేమని జస్టిస్ ఎడప్పగత్ అన్నారు. ‘పిల్లలను అశ్లీల చిత్రాలకు ఉపయోగించినట్లు చూపించడానికి ఏమీ లేదు. వీడియోలో లైంగిక వాంఛ గురించి ఎలాంటి సూచన లేదు. పురుషుడు లేదా స్త్రీ అయినా, ఒక వ్యక్తి నగ్నమైన పైభాగంలో పెయింటింగ్ చేయడం లైంగిక అసభ్యకరమైన చర్యగా పేర్కొనబడదు’ అని కోర్టు పేర్కొంది. లింగ బేధంతో సంబంధం లేకుండా, వ్యక్తులందరూ తమ శరీరానికి స్వయంప్రతిపత్తికి అర్హులని, అయితే మహిళలు తరచుగా ఈ హక్కును కోల్పోతారని కోర్టు పేర్కొంది. మహిళలు వేధింపులకు గురవుతున్నారని, వారిపై వివక్ష చూపుతారని పేర్కొన్న కోర్టు..నగ్నత్వాన్ని సెక్స్‌తో ముడిపెట్టకూడదు” అని పేర్కొంది.