యాత్ర దర్శకుడు మహి . వి. రాఘవ కొత్త వెబ్ సిరీస్ సైతాన్ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ ట్రైలర్‌పై పెద్ద చర్చ కూడా జరుగుతోంది.
యాత్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు మహి. వి. రాఘవ. ప్రస్తుతం ఆయన తన ఫోకస్‌ను సినిమాల మీద నుంచి వెబ్ సిరీస్‌ల మీదకు మళ్లించారు. ఆయన తాజా వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’కు ప్రేక్షకులనుంచి ఆదరణ లభించింది. ఇక అదే ఊపుతో మహి మరో వెబ్ సిరీస్‌ను విడుదలకు సిద్ధం చేశారు. ‘సైతాన్’ పేరిట తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ జూన్ 15న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
దీనికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలోని కొన్ని బూతు డైలాగులు మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ను మించిపోయి ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో పచ్చి బూతులను అలానే పెట్టేశారు. ఆ డైలాగులు వింటే నిజంగా మతి పోతుంది. ‘ఏంట్రా ఇది మరీ ఇంత దారుణమైన డైలాగులు పెట్టారు’ అని తప్పకుండా అనిపిస్తుంది. కొంతమంది నెటిజన్లు.. ఈ వెబ్ సిరీస్ రానా నాయుడును మించిపోయి ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, మహి వి రాఘవ 2014లో వచ్చిన పాఠశాల సినిమాతో దర్శకుడిగా మారారు.
ఆ తర్వాత ఆయన తీసిన ‘ఆనందో బ్రహ్మ’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. 2019లో వచ్చిన వైఎస్సార్ బయోపిక్ ‘ యాత్ర’ దర్శకుడిగా మహిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ప్రస్తుతం యాత్రకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారు. యాత్ర 2గా ఈ సినిమాకు నామకరణం చేశారు. మరి, సోషల్ మీడియాలో సంచలనంగా మారిన యాత్ర దర్శకుడి సైతాన్ వెబ్ సిరీస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.