తెలుగు చలనచిత్ర రంగంలో వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం మాములే. ఇక పరిశ్రమలోని పెద్ద కుటుంబాల నుండి సీజన్ కి ఒకరు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. తాజాగా ఘట్టమనేని కాంపౌండ్ నుండి కూడా ఓ హీరో లాంచ్ కాబోతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అమరరాజ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు ‘హీరో’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేసింది మూవీ యూనిట్. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ టీజర్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదగా విడుదల అవ్వడం విశేషం.
హీరో టైటిల్ టీజర్ లో అశోక్ గల్లా ముందుగా కౌబాయ్ లుక్ లో కనిపించడం విశేషం. ఆ తరువాత జోకర్ లుక్ లో అతని పెర్ఫరామెన్స్ ఆకట్టుకుంది. ఇదే టీజర్ లో రొమాంటిక్ టచ్ లో కూడా అదరగొట్టాడు అశోక్ గల్లా. ఇక టీజర్ చూసిన వారంతా గల్లా వారబ్బాయి గురి తప్పేలా లేడే అన్న కామెంట్స్ చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ టీజర్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. టీజర్ లో కనిపిస్తున్న స్టార్ సింబల్, గన్స్, ట్రైన్ షాట్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఇందులో అశోక్ గల్లా సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సీనియర్ హీరో జగపతిబాబు కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండటం విశేషం. మరి.., ఇన్ని ప్రత్యేకతల నడుమ తెరకెక్కుతోన్న “హీరో” మూవీ హీరోగా అశోక్ గల్లాకి ఎలాంటి లాంచింగ్ అవుతుందో చూడాలి.