కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పవర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఆయన సడెన్ కు హార్ట్ ఎటాక్ కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇక వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.
దీంతో వెంటనే స్పందించిన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పూనీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అయితే పునీత్ మరణవార్త విన్న సినిమా పరిశ్రమలోని ప్రముఖులే కాకుండా రాజకీయ, క్రీడా రంగంలోని ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. వీరేంద్ర సెహ్వగ్, సోను సూద్, చిరంజీవి వంటి ప్రముఖులు స్పందించారు. ఇక తాజాగా స్పందించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. పునీత్ రాజ్ కుమార్ మరణవార్త విని చాలా దిగ్భ్రాంతికి గురయ్యానని ట్వీట్ చేశారు. ఇక నేను కలుసుకున్న అత్యంత వినయపూర్వకమైన వ్యక్తుల్లో పునీత్ ఒకరని మహేష్ బాబు అన్నారు.
Shocked and deeply saddened by the tragic news of Puneeth Rajkumar’s demise. One of the most humble people I’ve met and interacted with. Heartfelt condolences to his family and loved ones 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) October 29, 2021