టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలతో ఇటు యాడ్స్‌తో బీజీ బీజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేష్ ఖాతాలో ప్రస్తుతం పలు పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలతో ఇటు యాడ్స్‌తో బీజీ బీజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేష్ ఖాతాలో ప్రస్తుతం పలు పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి. అయితే మహేష్ సినిమాలతో పాటు ఎక్కువగా యాడ్స్ చేయడానికి గల కారణం ఏంటి?.. చాలామందికి ఈ విషయంలో సందేహం ఉండొచ్చు. అయితే మహేష యాడ్స్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే.. మహేష్, MB FOUNDATION (మహేష్ బాబు ఫౌండేషన్) ద్వారా చిన్న పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్ర హాస్పిటల్‌తో కలిసి ఇప్పటికి 1000కి పైగా గుండె ఆపరేషన్లు చేయించారు.
వాటికి అయ్యే ఖర్చు కోసమే యాడ్స్ చేస్తుంటాడనే మాట ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. చాలా మంది సెలబ్రిటీలు డబ్బుల కోసమే యాడ్స్ చేస్తుంటారు. అలాగే పలు కంపెనీలు కూడా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం కోట్లాది రూపాయలు ఇచ్చి స్టార్లను తమ బ్రాండ్లకు అంబాసిడర్‌గా నియమించుకుంటుంటాయి. కాగా, సేవా కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా, అదీ ఉచితంగా అంటే.. దాదాపుగా ఎవ్వరూ ముందకు రారు.
కానీ, మహేష్ మంచి మనసుతో ముందుకొచ్చారు. Heal A Child అనే ఓ NGO సంస్థకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ సంస్ధ పేద పిల్లలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తుంది. తాజాగా Heal A Child సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమానికి భార్య నమ్రతతో కలిసి పాల్గొన్నారు. దీంతో మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ముందుంటారని, మంచి సేవా గుణం ఉన్న వ్యక్తి అని.. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా మహేష్ బాబు హీరోనే అని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, కూడా ఆయణ్ణి అభినందిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ మూవీలో నటిస్తున్నాడు. శ్రీ లీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుంది.