సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్టర్‌గానే కాకుండా, బిజినెస్‌మెన్, ప్రొడ్యూసర్, బ్రాండ్ ప్రమోటర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఆపదలో ఉన్న వారి పాలిట దేవుడిగా మారాడు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలతో ఇటు యాడ్స్‌తో బీజీ బీజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేష్ ఖాతాలో ప్రస్తుతం పలు పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి.