అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఇటివల విడుదలై విజయం సాధించిన ‘మేజర్’ మంచి విజయం అందుకుంది. ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. 2008 నవంబర్ 26 న ముంబైలో టెర్రరిస్టులు మారణహోం సృష్టించారు. ఆ సమయంలో ఎంతో తెగువ చూపించి ఇండియన్ గొప్పతనం ఎంటో నిరూపించాడు మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్. ఆ చేసిన సాహసాల గురించి అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు శశికిరణ్.
ఇది చదవండి: Manchu Vishnu: మంచు విష్ణు కొత్త మూవీ టైటిల్ పై వివాదం!
‘ఈ మూవీ ప్రతి ఒక్కరినీ కదిలించే విధంగా ఉందని.. సామాజిక అంశాలపై ఎంతో మక్కువ ఉన్న హీరో అడవి శేష్ కి అభినందనలు. ఇలాంటి హీరోలు సినీ ఇండస్ట్రీకి తప్పకుండా కావాలి రావాలి. ఒక గొప్ప సైనికుడి గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఈ మూవీని తప్పకుండా చూస్తాను.. చిత్ర యూనిట్ కి నా అభినందనలు’అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విద్యార్థులకు ఆర్టీసీ షాక్.. భారీగా పెరిగిన బస్ పాస్ ఛార్జీలు!
ఇక పవన్ ట్విట్ కి మేజన్ మూవీ నిర్మాతల్లో ఒకరైన మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. అలాగే హీరో అడవి శేష్ కూడా ప్రత్యేంగా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. గతంలో పవన్ కళ్యాన్, అడవి శేషు ‘పంజా’ చిత్రంలో నటించారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thank you @PawanKalyan! Team #Major is truly humbled!@AdiviSesh @SashiTikka @prakashraaj @SharathWhat @anuragmayreddy @saieemmanjrekar @sonypicsfilmsin @GMBents @AplusSMovies pic.twitter.com/MsTtyGHMPQ
— Mahesh Babu (@urstrulyMahesh) June 12, 2022