టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోలేకపోయింది. రిలీజ్ ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన లైగర్ మూవీ.. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందింది. ఈ సినిమాను బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో పాటు పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.
ఇక దేశవ్యాప్తంగా విజయ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ దృష్ట్యా లైగర్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందేమో అనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ.. తీరా థియేటర్లోకి వచ్చాక సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం. సినిమా చూసిన విజయ్ అభిమానులే లైగర్ కథాకథనాలు బలంగా లేవని, చెత్త సినిమా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ సైట్ IMDb(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) రేటింగ్ లో లైగర్ అతి తక్కువ రేటింగ్ నమోదు చేసి షాకిచ్చింది.
లైగర్ సినిమాకు ఐఎండిబి 10కి కేవలం 1.7 రేటింగ్ మాత్రమే ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ మధ్యకాలంలో విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న ది లెజెండ్(4.7), లాల్ సింగ్ చడ్డా(5) సినిమాలకంటే తక్కువ రేటింగ్ నమోదు చేయడనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో లైగర్ సినిమాపై.. అది క్రియేట్ హైప్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అదీగాక సినిమాకి పేలవమైన స్పందన రావడంతో చిత్రబృందం కూడా సైలెంట్ అయిపోయింది.
ఇదిలా ఉండగా.. మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన లైగర్.. రెండో రోజుకు వచ్చేసరికి కలెక్షన్స్ భారీ స్థాయిలో పడిపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే లైగర్ కి ‘బుక్ మై షో’లో కూడా 60% మాత్రమే రేటింగ్ నమోదైంది. ఇక ఈ సినిమాలో విజయ్ బాక్సర్ రోల్ లో నటించగా.. రమ్యకృష్ణ, అనన్య పాండే, మైక్ టైసన్ ఇతర పాత్రలలో నటించారు. మరి ఐఎండిబి సైట్ లో లైగర్ అందుకున్న రేటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#TheLegend#Liger #IMDb Rating #அண்ணாச்சி டா pic.twitter.com/kz9yT6l8q6
— Amul Sir (@amul_sir) August 27, 2022
This happened When mix Bollywood & South, 1 more a big disaster worst movie, and why love is important in every movie 🤮,
See #LigerDisaster movie rating on IMDb #Liger#Ligerflop #IMDb #decreaseshowsliger pic.twitter.com/jeyJRNUlPo— Nobody (@NeoRafiq) August 26, 2022