ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు.. విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన సినిమా లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో.. ఛార్మి నిర్మాతగా వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య హీరో హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం దేశ వ్యాప్తంగా పర్యటించింది. సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశారు. ఆగస్టు 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రమోషన్‌లో చెప్పినంత గొప్పగా సినిమా లేదని తేల్చేశారు ప్రేక్షకులు. మొత్తానికి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ప్రమోషన్స్ కారణంగా టాక్‌తో సంబంధం లేకుండా ఫస్ట్ డే లైగర్ భారీ బిజినెస్ చేసింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ప్రాంతాల వారీగా లైగర్ ఫస్ట్ డే కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
లైగర్ సినిమా ఫస్ట్‌డే కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.