Liger: విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సగటు సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఎదురు చూసిన ‘లైగర్’ సినిమా గురువారం థియేటర్లలోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. అయితే, అంచనాలు తారుమారు అయ్యాయి. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికి కలెక్షన్ల విషయంలో మాత్రం లైగర్ సూపర్ అనిపించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డేన మొత్తం కలెక్షన్లు 15 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక, ప్రపంచవ్యాప్తంగా లైగర్ సినిమా 24.5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.
ఈ నేపథ్యంలోనే సినిమాలో నటించిన వారి రెమ్యూనరేషన్‌లకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. ‘లైగర్’ క్యారెక్టర్ కోసం విజయ్ దేవరకొండ దాదాపు 20 నుంచి 35 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, విజయ్ దేవరకొండకు జంటగా నటించిన అనన్యపాండే 3 కోట్ల రూపాయలు, విజయ్ తల్లిగా నటించిన రమ్య కృష్ణ కోటి రూపాయలు, రోనిత్ రాయ్ 1.5 కోట్లు, విష్ణు రెడ్డి 60 లక్షల రూపాయలు, మకరంద్ దేశ్‌పాండే 40 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక, ‘లైగర్’ సినిమాలో గెస్ట్ పాత్ర చేసిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు మైక్ టైసన్‌కు విజయ్ దేవరకొండ కంటే ఎక్కువ మొత్తం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో తక్కువ నిడివి ఉన్న పాత్ర చేసిన మైక్ టైసన్‌కు హీరో విజయ్ దేవరకొండ కంటే ఎక్కువ మొత్తం ఇచ్చారా లేదా అన్నది నిర్మాతలకే తెలియాలి. మరి, లైగర్ సినిమా నటీనటుల రెమ్యూనరేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Anchor Anasuya: అనసూయపై విజయ్ ఫ్యాన్స్ బూతులు? అనసూయ నీకు డబ్బులు ఇస్తే అంటూ..!