Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఆఫీస్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం పనైయుర్, ఈసీఆర్ రోడ్డులోని విజయ్ హెడ్ ఆఫీస్‌లో కొన్ని మరమ్మత్తులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభాకరన్ అనే పేయింటర్ అక్కడ పనిచేస్తున్నాడు. ఆఫీస్ పేయింట్ చేయటానికి ప్రభాకరన్ ఓ నెల రోజుల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కొద్దిరోజుల క్రితం కుటుంబసభ్యుల్ని కలవటానికి ప్రభాకరన్ ఇంటికి వెళ్లాడు. బుధవారం రాత్రి తిరిగి వచ్చాడు. ఆ టైంలో ఫుల్లుగా తాగిఉన్న అతడు పరాటా తినటానికి వంద రూపాయలు కావాలని సూపర్ వైజర్‌ని అడిగాడు. సూపర్ వైజర్ 100 రూపాయలు ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రభాకరన్ చనిపోయి కనిపించాడు.
అతడి నోట్లో, చేతిలో పరోటా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో పరోటా తినటం వల్ల అది కాస్తా గొంతులో ఇరుక్కుని ప్రభాకరన్ చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాగా, విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తున్నారు. మరి, విజయ్ ఆఫీస్‌లో వ్యక్తి మృతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Swathi Sathish: వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్!