Swathi Sathish: పంటి సమస్య నుంచి విముక్తి పొందటానికి సర్జరీ చేయించుకోవటం ఆ హీరోయిన్ పాలిట శాపం అయింది. రూట్ కెనాల్ సర్జరీ వికటించి ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. వైద్యుడి తప్పుడు ట్రీట్‌మెంట్ కారణంగా తనకు ఇలా అయిందని సదరు హీరోయిన్ ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన స్వాతి సతీష్ శాండల్‌వుడ్‌లో హీరోయిన్‌గా రానిస్తోంది. ఎఫ్‌ఐఆర్, 6టు6 వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొన్ని నెలలుగా పంటి సమస్యతో బాధ పడుతున్న ఆమె రెండు వారాల క్రితం వైద్యం కోసం ఓరిక్స్ డెంటల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యుడు ఆమెకు రూట్ కెనాల్ సర్జరీ నిర్వహించాడు. అయితే, ఈ సర్జరీ తర్వాత ఆమె ముఖం, పెదాలు విపరీతంగా వాచిపోయాయి. ఇదేంటని ఆమె అడగ్గా.. రెండు,మూడు రోజుల్లో తగ్గిపోతుందని వైద్యుడు చెప్పాడు. కానీ, రెండు వారాలు గడిచినా ఆ వాపు తగ్గలేదు. విపరీతమైన నొప్పి కూడా వస్తోంది. వాపు కారణంగా ఇంట్లోనుంచి బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమె మరో ఆసుపత్రికి వెళ్లింది. ఓరిక్స్ డెంటల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు స్వాతి సతీష్‌కు తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వటం కారణంగా ఆమె ముఖం వాచిపోయిందని తేలింది. దీంతో ఆగ్రహానికి గురైన హీరోయిన్ ఓరిక్స్ డెంటల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తనకు తప్పుడు వైద్యం చేసి ఇబ్బందుల పాలు చేసిన ఆసుపత్రిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకుంది. వాపు ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తోంది. వాపు పూర్తిగా తగ్గిన తర్వాత ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మరి, హీరోయిన్ రూట్ కెనాల్ సర్జరీ వికటించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Pictures of Kannada actress #swathisathish go viral after her root canal #surgery goes wrong... For more: https://t.co/ofhbFU4Agu pic.twitter.com/VMpr16c7wJ — ETimes Photogallery (@ETimesPhotos) June 20, 2022 ఇవి కూడా చదవండి : Kamal Haasan: ‘విక్రమ్’ సక్సెస్.. చిత్రబృందానికి కమల్ గ్రాండ్ పార్టీ.. ఫోటోస్ వైరల్!