రష్మిక మందన.. ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారింది. సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బిగ్‌బీతో కలిసి.. గుడ్‌బై సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక, సిద్థార్థ్ మల్హోత్రా జంటగా నటించిన మిషన్ మజ్ను విడుదల కానుంది. జనవరి 20న.. ఈ సినిమా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రసుత్తం రష్మిక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అయితే ఈమధ్య కాలంలో.. రష్మిక పలు వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా.. బాలీవుడ్ క్రిటిక్‌గా పేరు పొందిన కేఆర్‌కే.. నేషనల్ క్రష్ రష్మికపై దారుణమైన ట్రోల్స్ చేశాడు. రష్మిక బాలీవుడ్‌లో సెటిల్ అవ్వలేదని.. భోజ్‌పూరి సినిమాలకు మాత్రమే సూట్ అవుతుందంటూ దారుణంగా ట్రోల్స్ చేశాడు. ఆ వివరాలు..
కేఆర్‌కే సోమవారం తన ట్విట్టర్‌లో రష్మిక మందనను విమర్శిస్తూ.. సంచలన పోస్ట్ చేశాడు. రష్మికను విమర్శించే పనిలో భాగంగా.. విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వైఫల్యం గురించి ఎగతాళి చేశాడు. సమీప భవిష్యత్తులో హిందీ ప్రేక్షకులు రష్మిక అప్‌కమింగ్ హిందీ చిత్రాలను కూడా ఇలాగే ఫెయిల్ చేస్తారని.. అంతేకాదు రష్మిక కేవలం భోజ్‌పురి సినిమాలకు మాత్రమే సెట్ అవుతుందని.. ఆమెను వాటిల్లో చూడటం ఆనందంగా ఉంటుందని విమర్శిస్తూ.. ట్వీట్ చేశాడు కేఆర్‌కే.
ఈ క్రమంలో కేఆర్‌కే ట్విట్టర్ వేదికగా.. ‘‘మేడమ్ రష్మిక మందన జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతడిని.. బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నిన్ను కూడా అలాగే చేయబోతున్నారు. కానీ మిమ్మల్ని భోజ్‌పురి చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉంటుంది’’ అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై అభిమానులు మండిపడుతున్నారు. ముందు నీ సంగతి చూసుకో.. తర్వాత మిగతా వారి గురించి కామెంట్స్ చేద్దువు గానీ అంటూ కేఆర్‌కేపై మండి పడుతున్నారు అభిమానులు.
అంతేకాక.. అతడు నటించిన ‘దేశద్రోహి’ సినిమా ఫ్లాప్‌ను ప్రస్తావిస్తూ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని క్లాస్ పీకుతున్నారు నెటిజనులు. ఆ సినిమా తర్వాత కేఆర్‌కేను దేశం నుంచి వెళ్లగొట్టిన తీరును.. ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. అంతేకాక రష్మిక, విజయ్ దేవరకొండకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు అభిమానులు. గత కొన్ని రోజులుగా.. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ.. రిలేషన్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరి.. మాల్దీవ్స్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పిక్స్ చూసిన ఫ్యాన్స్.. విజయ్, రష్మిక ఒకేచోట ఉన్నారని కన్‌ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ వీరిద్దరూ మాత్రం.. తమ మధ్య ఏం లేదని చెబుతూ వస్తున్నారు. మరి రష్మికపై కేఆర్‌కే చేసిన వ్యాఖ్యలు సరైనవేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Madam @iamRashmika Ji hope you know, what we Hindi audiences did with your boyfriend Anakonda film #Liger and throw him out of Bollywood. Exactly same, we are going to do with you. But we will be happy to watch you in Bhojpuri films.
— KRK (@kamaalrkhan) January 9, 2023