టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే హీరో ప్రభాస్ గుర్తొస్తాడు. చాలా ఏళ్ల నుంచి పెళ్లి అప్పుడు ఇప్పుడు అంటున్నారు తప్పించి… ప్రభాస్ అసలు మ్యారేజ్ చేసుకుంటాడా లేదా అనేది పెద్ద మిస్టరీ అయిపోయింది. ఫ్యాన్స్ కూడా ఆ విషయం పట్టించుకోవడమే మానేశారు. కానీ కొన్నాళ్ల ముందు మాత్రం హీరోయిన్ కృతిసనన్ తో డేటింగ్ లో ఉన్నాడని మీడియాలో తెగ వార్తలొచ్చాయి. ఇది నిజమనుకునేలా.. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ న్యూస్ కి హీరోయిన్ కృతిసనన్ ఇంకాస్త మసాలా యాడ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ పేరు చెప్పగానే అనుష్క గుర్తొస్తుంది. వీళ్ల పెయిర్ అలాంటిది. కానీ తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇవ్వడంతో అంతా సైలెంట్ అయిపోయారు. కానీ ‘ఆదిపురుష్’ షూటింగ్ టైంలో హీరోయిన్ కృతిసనన్ మాత్రం హీరో ప్రభాస్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు, క్లోజ్ గా మూవ్ అయినట్లు కనిపించింది. కొన్నాళ్ల ముందు ‘కాఫీ విత్ కరణ్’ షోకి వచ్చిన కృతి.. ప్రభాస్ కి ఫోన్ చేసింది. త్వరగా లిఫ్ట్ చేసేవారికి మాత్రం షో నుంచి ఫోన్ చేస్తుంటారు. అలా తన కాల్ త్వరగా లిఫ్ట్ చేస్తాడని కృతిసనన్ కి తెలుసు. కాబట్టే ప్రభాస్ కి ఫోన్ చేసింది.
ఇది కాదన్నట్లు ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్ ఈవెంట్ లోనూ ప్రభాస్-కృతిసనన్ జోడీ ఆకట్టుకుంది. ప్రభాస్ మోకాలికి సర్జరీ కావడంతో ఆరోజు సరిగ్గా నిలబడలేకపోయాడు, నడవలేకపోయాడు. దీంతో కృతి.. తన చేయి అందించి సాయం చేసింది. ప్రభాస్ కు చెమటలు పడుతుంటే.. తన చీర కొంగు అందించింది. అలానే ప్రభాస్ ని తినేసేలా కృతిసనన్ కొంటెచూపులు చూస్తూ కనిపించింది. ఆ వీడియోలన్నీ అప్పట్లో తెగ వైరలయ్యాయి. ఇక తాజాగా భేడియా(తెలుగులో ‘తోడేలు’) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కృతి.. ప్రమోషన్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంది.
ఈ మూవీ ప్రచారంలోనూ ప్రభాస్ పేరు, పదేపదే ప్రస్తావన వచ్చింది. కృతిసనన్ గురించి చెబుతా, ఆమె జీవితంలోని డార్లింగ్ వచ్చాడని హీరో వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా కృతిసనన్ కి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ముగ్గురిలో ఎవరితో ఫ్లర్ట్ చేస్తావ్, ఎవరిని పెళ్లి చేసుకుంటావ్, ఎవరితో డేట్ చేస్తావ్ అని యాంకర్ మూడు ఆప్షన్ ఇవ్వగా.. కార్తీక్ ఆర్యన్ తో ఫ్లర్టింగ్, టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ అని చెప్పి, ఛాన్స్ వస్తే ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని కృతి చెప్పింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నార్త్ వదిన కన్ఫర్మ్ అయిపోయిందని సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు. మరి కృతి ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి ప్రభాస్ పెళ్లి గురించి సందేహాలు వస్తున్నాయి. మరి ఇది రూమర్ గానే ఉండిపోతుందా? రియాలిటీలో జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది.
If ever get a chance I will marry #Prabhas.
–@kritisanon ❤
Ok ika fix aipondi North Vadina ani 🥳🥳🥰 #Prakrithi pic.twitter.com/Q67ppL7WIy— Dps Nayak™ 💔 (@NayakTweetz) November 25, 2022