యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..టాలీవుడ్‌లోనే కాకుండ దేశ వ్యాప్తంగా ఓ స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. ఇక బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలిగిపోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రాదే శ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి వరుస సినిమాలతో బజీగా మారిపోయాడు. అయితే వయసు మీదపడుతున్న ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవటం లేదంటూ సినీ అభిమానులు అనుకుంటున్నారు.
స్వీటీ అనుష్కతో ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నారంటూ గతంలో ఎన్నో వార్తలు పుకార్లు చేశాయి. కాగా ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ ప్రభాస్‌తో పెళ్లికి రెడీ అంటూ వ్యాఖ్యలు చేసింది. ఏంటీ ఈ వార్త నిజమే అనుకుంటున్నారా?..అలా కాకపోయిన కృతి సనన్ అన్నది మాత్రం వాస్తవం.
ఇక విషయం ఏంటంటే..? తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతీ సనన్… ప్రభాస్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్ ఈ ముగ్గురి హీరోల్లో మీరు ఎవరితో డేట్‌కు వెళతారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవర్నీ ఫ్లర్ట్‌చేస్తారు? అని ప్రశ్నించగా..టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్‌కు వెళతానని, కార్తీక్ ఆర్యన్‌ను ఫ్లర్ట్ చేస్తానని, ఇక ప్రభాస్‌ను మాత్రం పెళ్లి చేసుకుంటానంటూ చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ అందాల బామ. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది కృతి సనన్. భారీ బడ్జెట్‌తో రూపోందుతున్న ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.