సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో కన్ను మూశారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబంలోనే కాక.. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఘట్టమనేని కుటుంబానికి ఈ ఏడాది అస్సలు అచ్చిరాలేదు. 2022లో ఘట్టమనేని కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మృతి చెందారు. తొలుత రమేష్ బాబు, తర్వాత కృష్ణ భార్య ఇందిరా దేవి.. ఇప్పుడు కృష్ణ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్, బ్రెయిన్ డ్యామేజీ కారణంగా కృష్ణ మృతి చెందినట్లు.. ఆయనకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.
కృష్ణ మృతి చెందారని తెలియడంతో.. ఆయన కుటుంబ సభ్యులు.. హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో నటుడు నరేష్ కూడా పవిత్రా లోకేష్‌తో కలిసి ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు. ఇక కృష్ణ మనవళ్లు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు. మరి కొద్ది సేపట్లో కృష్ణ మృతదేమాన్ని.. ఆయన కుటుంబ సభ్యులకు అందజేస్తామని కాంటినెంటల్ వైద్యులు తెలిపారు. కృష్ణ మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.