పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్లు చేయటం చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఓ ఈవెంట్లో పాల్గొన్న కోట.. పవన్‌పై పరోక్షంగా కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్‌లా మరొకరు రారని అన్నారు. అలా రావాలంటే మళ్లీ ఆయనే పుట్టాలని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణలు ఎప్పుడూ ఏనాడూ తమ రెమ్యూనరేషన్ గురించి బాహాటంగా మాట్లాడలేదన్నారు. కానీ, ఇప్పుడు ‘‘నేను రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నాను’’ అని చెప్పటం ఏంటని పేర్కొన్నారు. ఇవ్వాళ సినిమా లేదని, కేవలం సర్కస్ మాత్రమే మిగిలిందని అన్నారు.
విషాద గీతాలకు కూడా డ్యాన్సులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అన్నీ హీరోలే చేస్తే మిగిలిన నటులు ఏం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ జనసేన పదవ వార్షికోత్సవ సభలో తన పారితోషికం గురించి కీలకవ్యాఖ్యలు చేశారు. డబ్బులకు ఆశపడే వ్యక్తిని తాను కాదన్నారు. తాను ఇప్పుడు చేస్తున్న సినిమాకు 22 రోజులు కాల్షీట్లు ఇచ్చానని, ఆ సినిమాకు తాను తీసుకునే డబ్బు రోజుకు రెండు కోట్లని తెలిపారు. ఇరవై రోజులు పని చేస్తే దాదాపు 45 కోట్లు తీసుకుంటానని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కోట శ్రీనివాసరావు పరోక్షంగా కామెంట్లు చేసింది పవన్ కల్యాణ్పైనేనని నెటిజన్లు భావిస్తున్నారు. కోట ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కొత్తేమీ కాదు.. గతంలో చాలా సార్లు మెగా ఫ్యామిలీపై ఆయన వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీ హీరోలపై బాహాటంగా విమర్శలు చేశారు. ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీలోని పవన్‌పై వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కోట వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి, కోట వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.