సెలబ్రిటీలకు సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. వీటిల్లో చాలా వరకు తప్పుడు వార్తలే ఉంటాయి. ఇక తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుకు సంబంధించి ఇలాంటి పేక్ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..
తెలుగు ఇండస్ట్రీలో విలనీజానికి కొత్త భాష్యం చెప్పారు సీనియర్ నటులు కోటా శ్రీనివాస రావు. ఓ వైపు విలనీజం పండిస్తూనే కడుపుబ్బా నవ్వించేవారు. కోటా శ్రీనివాసరావు అంటే తెలుగు వారందరికీ ఇష్టమే. ఆయన ఈ మధ్య సినిమాల్లో కనిపించడం మానేశారు. వయసు మీద పడటంతో తాను సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మద్య కొన్ని ఇంటర్వ్యూల్లో కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు కోట. మొన్న ఆ మధ్య జబర్ధస్త్ యాంకర్ […]