కిరాక్ ఆర్పీ.. బుల్లితెరపై మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. జేడీ చక్రవర్తితో ఎంఎంఓఎఫ్ మూవీ కూడా చేశాడు. అంతేకాకుండా ఇదేం దెయ్యం, వజ్రకవచదర గోవిందా సినిమాలతో మెప్పించాడు. జబర్దస్త్ తో తన కెరీర్ మొదలుపెట్టిన ఆర్పీ.. ఆ తర్వాత ఆ షోకు దూరమమైన విషయం తెలిసిందే. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నాక.. ప్రస్తుతం కామెండీ స్టార్స్ లో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. ఇటీవలే లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి ఎప్పుడన్నది త్వరలోనే ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చారు.
త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట.. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కిరాక్ ఆర్పీతో ఆనందంగా ఉన్న క్షణాలను కెమెరాలో బందించిన లక్ష్మీప్రసన్నతో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీళ్లిద్దరి ఫొటోలు చూసిన ఫ్యాన్స్ లవ్ లీ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోష్ మీడియాలో వైరల్ గా మారాయి. కిరాక్ ఆర్పీ- లక్ష్మీ ప్రసన్నల హ్యాపీ మూమెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.