టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున బర్త్‌డే సందర్భంగా అప్ కమింగ్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. యాక్షన్ ఎంర్‌టైనర్‌లో నటించబోతున్నాడు నాగార్జున. ‘ది ఘోస్ట్‘ అంటూ నాగార్జున ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. కత్తి పట్టుకుని ఉన్న నాగార్జునను చూసి గూండాలు, డాన్‌లు వణికిపోతూ కనిపిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో ఉన్న అంశాలను గమనిస్తే ఇది అంతర్జాతీయ మాఫియా చిత్రంలా కనిపిస్తోంది. ఈ సినిమాలో నాగ్ సరసన కాజల్ సందడి చేయనుంది. ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ది ఘోస్ట్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
Wishing King @iamnagarujuna garu a fabulous birthday 🥳 🎂 🎉#TheGhost #KingNagarjuna #KingNagarjunasGhost @MsKajalAggarwal #NarayanDasNarang #RamMohanRao @AsianSuniel @sharrath_marar @SVCLLP @nseplofficial @anikhaofficial_#HBDKingNagarjuna pic.twitter.com/KTLQUZovU3
— Praveen Sattaru (@PraveenSattaru) August 29, 2021