ప్రేమ.. ఓ మధురమైన భావన. రెండు హృదయాలను దగ్గర చేసే గొప్పతనం ఒక్క ప్రేమకి మాత్రమే సొంతం. కానీ.., ఈరోజుల్లో అలాంటి స్వచ్ఛమైన ప్రేమలు ఉంటున్నాయా అంటే లేవనే సమాధానం వినిపిస్తోంది. నచ్చినప్పుడు ఒక్కటవ్వడం, బోర్ కొడితే విడిపోవడం ఇప్పుడు ఎక్కువ అయ్యింది. సరిగ్గా ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది స్టార్ హీరోయిన్ కిమ్ శర్మ.
ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా పరిచయమే. అప్పట్లో ఖడ్గం మూవీలో అందాలు ఆరబోసింది, మగధీరలో వాన పాటలో తడిసింది ఈ ఒయ్యారే. రీల్ లైఫ్ లో కిమ్ శర్మకి తిరుగు లేదనే చెప్పుకోవాలి. ఎక్కడా ఓ చోట కుదురుగా ఉండకుండా అన్నీ ఇండస్ట్రీలను చుట్టేయడం ఈ అమ్మడికి అలవాటు. అయినా.., నాలుగు పదుల వయసులో కూడా కిమ్ తన అందాలతో దుమ్ము లేపుతోంది. కానీ.., రియల్ లైఫ్ లో మాత్రం కిమ్ శర్మ ఇప్పటి వరకు సెటిల్ కాలేకపోయింది.
కెరీర్ స్టార్టింగ్ నుండి కిమ్ శర్మ చాలా రిలేషన్స్ మెయింటైన్ చేసింది. అప్పట్లో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కూడా ఈమె ప్రేమాయణం నడిపింది. ఆ తరువాత ఆ తర్వాత కొంతమంది స్టార్ హీరోలతో కూడా డేటింగ్ చేసి వార్తల్లో నిలిచింది. అయితే.. అప్పట్లో ఈ రిలేషన్స్ అన్నిటికీ బ్రేకప్ చెప్పి.., కెన్యాకు చెందిన బిజినెస్ మాన్ డాన్ అలీ పుంజాని పెళ్లి చేసుకుంది.
దీంతో.., కిమ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ.., కొన్ని రోజులకే వీరి వివాహ బంధం ముక్కలైంది. కిమ్ యధావిధిగా మరోసారి ప్రేమలో పడింది. ఆ సమయంలో హీరో హర్షవర్ధన్ రాణేతో పీకల్లోతూ ప్రేమలో ఉండిపోయింది కిమ్ శర్మ. దీంతో.., ఈ జంట పెళ్లి చేసుకుంటారన్న వార్తలు వచ్చాయి. కానీ.., ఈ బంధానికి కూడా బ్రేకప్ చెప్పిన కిమ్ శర్మ ఇప్పుడు మరో కొత్త బాయ్ ఫ్రెండ్ ని పట్టింది.
ఇండియన్ మొట్ట మొదటి టెన్నిస్ స్టార్ అనగానే ముందుగా గుర్తుకి వచ్చేది లియాండర్ పేస్. ఇప్పుడు పేస్ తో ప్రేమలో పడింది కిమ్ శర్మ. వీరిద్దరు కలిసి ముంంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇక గోవా బీచ్లో ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చారు ఈ వెటరన్ పెయిర్. దీంతో.., వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఈ రిలేషన్ తో కిమ్ శర్మ ప్రేమించిన వారి సంఖ్య ఆరుకి చేరినట్టు అయ్యింది. ఇక ఈ విషయంలో ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ హర్షవర్ధన్ రాణే స్పందించాడు. కిమ్ శర్మ, లియాండర్ పేస్ ప్రేమలో ఉన్నది నిజమైతే వారిద్దరికి బాగా సెట్ అవుతుందని హర్షవర్ధన్ రాణే కామెంట్స్ చేయడం విశేషం. మరి.. కిమ్ శర్మ ఇకనైనా ఈ ప్రేమ వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి.