KGF భారతీయ సినీ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోయింది ఈ సినిమా. కేజీఎఫ్ చాప్టర్ 1 ఏదో డబ్బింగ్ సినిమాగా విడుదలై.. అంచనాలకు మించిన భారీ విజయాన్ని అందుకుంది. దాంతో KGF పార్ట్ 2 పై ఓ రేంజ్‌లో అంచనాలు పెరగ్గా.. వాటికి ఏమాత్రం తగ్గకుండా.. పార్ట్-2 ని తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కలెక్షన్ల విషయంలో చాప్టర్ 1తో పోలిస్తే.. చాప్టర్ 2 భారీగా వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించిన తాత.. ప్రసుతం ఫుల్ బిజీ అయ్యారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
ఇది కూడా చదవండి: KGF మూవీలో సముద్రం సీన్ వెనుక ఇంత అర్థం దాగి ఉందా..?
ఈ క్రమంలో తాజాగా ఈ తాత.. సుమన్ టీవీకి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో భాగంగా కేజీఎఫ్ సినిమా అనుభవాల గురించే కాక.. ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ సలార్ చిత్రంలో తన రోల్ ఏంటో కూడా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి విరాల కోసం వీడియో చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: KGF Yash: KGF-3 ఎలా ఉండబోతుందో లీకులిచ్చిన యష్..!