రాకింగ్ స్టార్ యష్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్-2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో కేజీఎఫ్ మొదటి భాగం విడుదలై మంచి హిట్ అందుకుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన కేజీఎఫ్ చాప్టర్-2 కూడా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసి దూసుకుపోతుంది. అయితే ఇందులో నటించిన నటినటులు అందరికి ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటించిన నటులకు రెమ్యూనరేషన్ ఎంత అనేది అందులో ఒకటి. ఇప్పుడు ఆ విషయం గురించి తెలుసుకుందాం.
మొదట ఈ చిత్రంలో రాఖీ బాయ్ గా నటించిన యష్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో హీరోగా నటించినందుకు రూ.20 నుండి రూ.25 కోట్ల రూపాయల వరకు యష్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరో స్టార్ హీరో సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఇందులో రాఖీ బాయ్ ను ఎదుర్కొనే అధీరా పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. అయితే సినిమాకు సంజయ్ దత్ రూ.10 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడు. ఈ చిత్రంలో రమికా సేన్ అనే ఓ పవర్ ఫుల్ ప్రధాని పాత్రలో నటించిన రవీనా టాండన్ రూ.5 కోట్లు తీసుకుందట.
ఇక రాకీ బాయ్ లవర్ రీనా పాత్రలో శ్రీనిధి శెట్టి చక్కగా నటించింది. ఈమె రూ.2 కోట్ల వరకు తీసుకున్నది అని టాక్. ఈచిత్రంలో సీబీఐ ఆఫీసర్ రఘనందన్ పాత్రలో రఘునందన్ గా రావు రమేష్ నటించారు.ఇందుకు గాను ఆయన రూ.80 లక్షలు తీసుకున్నారట.రాకీ బాయ్ కథను వినిపించే రాజ్ విజయేంద్ర గా ప్రకాశ్ రాజ్ నటించారు. ఇందుకు గానూ ప్రకాష్ రాజ్ రూ.5 కోట్లు తీసుకున్నాడు.
ఇక ప్రకాష్ రాజ్ చెబుతున్న కథను వింటూ తనకు వచ్చిన డౌట్ లను అడుగుతూ ఉండే దీప హెగ్డే పాత్రలో మల్విక అవినాష్ నటించింది. ఇందుకు గానూ ఈమె రూ.1 కోటి తీసుకుందట. ఈ సినిమాలో ఆమ్మకు సంబంధించిన సెంటిమెంట్ సీన్స్ లు వేరే లెవెల్ అని చెప్పాలి.ఈ పాత్ర కోసం జోయిస్ రూ.30 లక్షలు మాత్రమే తీసుకుందట. మరి.. ఈ విషయాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.