వెండితెరపై కనిపించే రంగుల ప్రపంచంలో సినీ తారలు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తుంటారు. రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో నటీనటులు తమకు కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయని పలు ఇంటర్వ్యూలో చెబుతుంటారు.
వెండితెరపై ఒక్కసారి కనిపిస్తే చాలు సెలబ్రెటీ హోదా వస్తుందని ఎంతో మంది అనుకుంటారు. ఇందుకోసం తమ టాలెంట్ చూపించడానికి ఒక్క ఛాన్స్ కోసం స్టూడియోల వెంట తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అదృష్టం కలిసి వస్తే.. సినిమా ఛాన్సులు వాటంతట అవే వస్తుంటాయి.. అలా వచ్చి తమ సత్తా చాటుకున్నారు ఎంతోమంది నటీనటులు. లేటు వయసులో సినిమా ఛాన్సు కొట్టి వరసగా సినిమాల్లో నటిస్తున్నారు గోపరాజు రమణ. వెండితెరపై ఎన్నో పాత్రలతో మెప్పించిన వారికి రియల్ లైఫ్ లో ఎన్నో బాధలు, కష్టాలు.. కన్నీళ్లు ఉంటాయి. ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఉన్న కష్టాల గురించి చెప్పారు నటుడు గోపరాజు రమణ. వివరాల్లోకి వెళితే..
నటుడు గోపరాజు రమణ నాటకరంగంలో అనేక నాటకాల్లో నటించి ఉత్తమ నటుడిగా అవార్డులు తన సొంతం చేసుకున్నాడు. కాస్త లేటు వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీలో హీరో తండ్రిగా ఆయన తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్లో అంటే సుందరానికి, నరేష్ మూవీతో పాటు మరికొన్ని చిత్రాల్లో ఛాన్సులు పొగొట్టుకున్నానని అన్నారు. కరోనా ప్రభావం చాలా చూపించిందని.. ఆలస్యంగా మొదలు కావాల్సిన సినిమాలు తర్వగా ముగిసిపోతున్నాయని.. త్వరగా మొదలు కావాల్సిన సినిమాలు ఆలస్యంగా మొదలు అవుతున్నాయని అన్నారు.
కొన్నిసార్లు నా డేట్స్ క్లాష్ అవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని అన్నారు. నా వరకు నేను నిర్మాతలు బాగుంటే నటులు, ఇతర సాంకేతిక వర్గానికి చెందినవారు బాగుంటారని భావిస్తాను. మన స్వలాభం కోసం అవతలి వాళ్లకు ఇబ్బంది పడకూడదు.. కొన్ని మూవీస్ కి నాకు రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ ఇచ్చారని తెలిపారు. నటనకు ప్రాదాన్యత ఉన్న పాత్రలకు మంచి పేరు వస్తుంది. ఇక నా కుటుంబం విషయానికి వస్తే.. మా చిన్నబ్బాయికి ఒక పాప తర్వాత బాబు పుట్టాడని.. ఆ బాబు మూడు రోజుల తర్వాత చనిపోయాడని అన్నారు. ఆ తర్వాత మరో బాబు పుట్టాడని.. అయితే ఆ బాబు కూడా బ్రతకడం చాలా కష్టమని డాక్టర్లు చెప్పారని గోపరాజు రమణ అన్నారు.
నా మనవడు పుట్టినపుడే చాలా బలహీనంగా పుట్టాడు.. చిన్నారికి మూడు హార్ట్ ఆపరేషన్లు చేయాలని డాక్లర్లు తెలిపారు.. అంతేకాదు హార్ట్ కూడా కావాల్సి వస్తుందని అన్నారు. అంతేకాదు వైద్యం కోసం చాలా ఖర్చు అవుతుందని.. బాబు బతకాలంటే ఈ ఖర్చు తప్పదని అన్నారు. అంత డబ్బు ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఓ ఆస్పత్రి యాజమాన్యం ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేస్తామని చెప్పారు.. కానీ ఏమైందో తెలియదు కానీ.. ఆపరేషన్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 2018 లో నా మనవడికి మొదటి ఆపరేషన్ అయ్యిందని.. ఆపరేషన్స్ కోసం 18 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని.. ప్రస్తుతం తన మనవడు క్షేమంగా ఉన్నాడని అన్నారు గోపరాజు రమణ.