బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్ రేంజ్ లో తన హవా కొనసాగించింది కత్రినా. అప్పట్లో ఈ అమ్మడితో నటించాలని హీరోలు పోటీ పడేవారు. దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ కూడా భారీగానే వసూళ్లు చేసేది కత్రినా. తన డ్యాన్స్ తో కుర్రాళ్లను హుషారెత్తించేది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ‘మల్లీశ్వరి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది.
బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు తమ కన్నా చిన్నవయసు ఉన్నవారిని ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం జరగింది. కత్రినా కైఫ్ కూడా అదే ట్రెండ్ ని ఫాలో అయింది. గత ఏడాది ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ ఆమెకున్నా ఐదు సంవత్సరాలు చిన్న. ప్రస్తుతం ఈ జంట ఫుల్ ఖుషీలో ఉన్నారు. కత్రినా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పిక్స్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
కత్రినా కైఫ్ ఈసారి అందరినీ అశ్చర్యపరిచేలా ఫోటోలు షేర్ చేసింది. ఏకంగా తన భర్తతో రొమాన్స్ చేస్తున్న ప్రైవేట్ పిక్ ని బయట పెట్టేసింది. స్విమ్మింగ్ పూల్ లో తన భర్త విక్కీకి టైట్ హగ్ చేసుకున్న ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్ లో సెగలు రేపుతోంది. ఈ పిక్ కి కత్రినా ‘ నేను నా వాడు’ అంటూ కామెంట్ పెట్టింది. ఇక విక్కీ కౌశల్ ఉరి చిత్రంతో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.