సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న ప్రముఖ తెలుగు సీనియర్ నటి జమున మరణించారు. అదే రోజు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కూడా మరణించారు. ఈ విషాదాలు మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు మన్దీప్ రాయ్ కన్నుమూశారు. గుండె పోటు కారణంగా ఆదివారం తెల్లవారుజామున ఆయన మరణించారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావటంతో ఆయన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు.
వైద్యులు మన్దీప్ ప్రాణాలు నిలపటానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మన్దీప్ మరణంపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. ఇక, మన్దీప్ మరణంపై ఆయన కూతురు అక్షత స్పందించారు. తన తండ్రి అంత్యక్రియలు ఈ రోజు హెబ్బల్ శ్మశాన వాటికలో జరుగుతాయని తెలిపారు. మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతామని అన్నారు. కాగా, మన్దీప్ తన కెరీర్లో దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
దాదాపు కన్నడ సూపర్ స్టార్స్ అందరితోనూ నటించారు. 1980లో వచ్చిన ‘‘మించిన ఒట’’ అనే సినిమా ఆయన మొదటి సినిమా.. చివరగా 2021లో ‘‘ఆటో రమణ’’ సినిమాలో కనిపించారు. నెల రోజుల క్రితం కూడా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడింది. వైద్యులు ఆయనకు ఆపరేషన్ నిర్వహించటానికి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. మరి, మన్దీప్ రాయ్ మరణంపై మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mandeep Roy was an affable person in real-life too. Would bump into him often in RPC Layout where I lived years ago. Always a happy person, he leaves behind unforgettable memories of roles he portrayed in Malgudi Days, Pushpaka Vimana and many more. Farewell 🙏 pic.twitter.com/yr1JR2So0K
— S Shyam Prasad (@ShyamSPrasad) January 29, 2023