స్త్రీలు దైర్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వారి ధైర్యం అందరిని భయపెట్టేలా ఉంటే మాత్రం కొంచెం ఆశ్చర్యానికి గురికాక తప్పదు. హీరోయిన్ల విషయంలో ఇలాంటి బోల్డ్ నెస్ కొంచెం ఎక్కవగా ఉంటుందనే చెప్పాలి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, డబ్బు, అందం.. ఉండడం వలన వీరు వేరొకరిపై ఆధారపడకుండా జీవించగలుగుతారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు ఇలాంటి విషయాల్లో అస్సలు వెనక్కి తగ్గరు. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
స్త్రీలు దైర్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వారి ధైర్యం అందరిని భయపెట్టేలా ఉంటే మాత్రం కొంచెం ఆశ్చర్యానికి గురికాక తప్పదు. హీరోయిన్ల విషయంలో ఇలాంటి బోల్డ్ నెస్ కొంచెం ఎక్కవగా ఉంటుందనే చెప్పాలి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, డబ్బు, అందం.. ఉండడం వలన వీరు వేరొకరిపై ఆధారపడకుండా జీవించగలుగుతారు. ఈ క్రమంలో కొంత మంది స్టార్ హీరోయిన్లు వారి భద్రతకు సంబంధించి.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు ఇలాంటి విషయాల్లో అస్సలు వెనక్కి తగ్గరు. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కంగనా రనౌత్.. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఏదో విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంది. సినిమాల్లోనే కాదు బయట కూడా ఈ అమ్మడు ధైర్యానికి మనం మెచ్చుకోవాల్సిందే. ఎవరికీ భయపడకుండా.. తనదైన అభిప్రాయాన్ని ధైర్యంగా అందరికి తెలియజేయడంలో ముందు వరుసలో ఉంటుంది. ఇటీవలే ఓ ప్రేమ వ్యవహారమై ఉద్దేశిస్తూ.. ట్విట్టర్ సీఈఓ “ఎలాన్ మస్క్” ఒక పోస్టు పెట్టాడు. “ప్రభుత్వాన్ని కూల్చకుండా అడ్డుకునేందుకు సీఏఐ పంపిన నకిలీ వ్యక్తి అని తెలిసినా.. వారితో ప్రేమలో పడడం విభిన్నమైన అనుభూతి” అని. ఎలాన్ మస్క్ పెట్టిన ఈ పోస్టుకి కంగనా రనౌత్ స్పందిస్తూ.. “నాకంటే నాటకమైన జీవితం ఎవరికీ ఉండదు. ఒక ప్రేమ వ్యవహారంలో మొత్తం సినిమా మాఫియా నన్ను జైలుకి పంపాలని చూసింది” అని చెప్పుకొచ్చింది. అంతే కాదు ఈ మధ్య కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అలియా బట్ ఇంటిని తన అనుమతి లేకుండా ఫోటోలు తీస్తుండగా.. ఆగ్రహానికి గురైన అలియాకి.. కంగనా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
ఆ మధ్య రాజమౌళిని విమర్శించే వారిపై కూడా గట్టిగానే విరుచుకుపడింది. ఇప్పుడు తన ఇంటి విషయంలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన ఇంటి ప్రాంగణంలోకి ఎవరైనా అనుమతి లేకుండా వస్తే కాల్చి పడేస్తా అని బోల్డ్ కామెంట్లు చేసింది. ముంబైలో తన ఇంటి ముందు “అనామకులకి ప్రవేశం లేదు. ఎవరైనా హద్దుమీరి ప్రవర్తిస్తే వారిని కాల్చిపడేస్తా. ఒకవేళ అప్పుడు కూడా ప్రాణాలతో మిగిలితే మళ్ళీ నా చేతిలో కాల్చబడతారు” అనే హెచ్చరిక బోర్డు ఒకటి పెట్టింది. దీనితో ఇప్పుడు కంగనా పెట్టిన వార్నింగ్ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక కొందరు ఈ అమ్మడు ధైర్యాన్ని కచ్చితంగా అభినందించాల్సిందే అని చెప్పుకొస్తుండగా .. మరికొందరు మాత్రం ఈ తరహా బోర్డులు పెట్టడం సరికాదని సూచిస్తున్నారు. మరి కంగనా తీరు మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I never believed someone can have more dramatic life than me, this sounds more exciting than entire film mafia trying to put me in jail for a love affair… 👌 https://t.co/AwnEb2n5Ja
— Kangana Ranaut (@KanganaTeam) March 19, 2023