చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటులు ఉన్నారు. కానీ సినిమా కోసం.. పాత్ర కోసం ప్రాణం పెట్టే నటులు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తారు హీరో చియాన్ విక్రమ్, కమల్ హాసన్ లూ. మన తెలుగులోను కసరత్తులు చేసి బాడీని సినిమా కోసం తయ్యారు చేసే హీరోలు సైతం ఉన్నారు. తాజాగా ఈ కోవలోకే వచ్చారు హీరో నందమూరి కళ్యాణ్ రామ్. మరి ఆయన సినిమా కోసం పడ్డ కష్టం గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార‘ అనే భారీ మూవీతో రాబోతున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మేనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తుండగా.. కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ లో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈక్రమంలో రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ కు విశేష స్పందని లభించింది. దాంతో ఈ సారి కళ్యాణ్ రామ్ కు హిట్ పక్కా అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా హీరో కళ్యాణ్ రామ్ కు సంబంధించిన సిక్స్ ప్యాక్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈనేపథ్యంలో సిక్స్ ప్యాక్ పై హీరో కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘నాకు వశిష్ట్ కథ చెప్పగానే ఒక్కసారిగా షాక్ తిన్నా. ఆ కథ నచ్చడంతో దానికోసం ఏమైనా చెయ్యాలని అప్పుడే ఫిక్స్ అయ్యా. అయితే నేను ఎంత మంచివాడవురా అనే సినిమా చేస్తున్న టైమ్ లో అనుకోకుండా 88కేజీల బరువు పెరిగా. ఇక ఈ సినిమా కోసం డైరెక్టర్ చెప్పిన విధంగా నా శరీరాన్ని మార్చుకున్నా. అలాగే ప్రస్తుతం 75కేజీలకు వచ్చా’ అని కళ్యాణ్ రామ్ తెలిపారు. ఒక వైపు చబ్బిగా.. మరో పక్క సిక్స్ ప్యాక్ తో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో హీరోలు ఒక మూవీ కోసం ఇంత కష్టపడతారా అని కొందరు నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ సినిమా కోసం తనను తాను ఇలా మార్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Urfi Javed: బికిని లాంటి డ్రెస్సులో బిగ్ బాస్ బ్యూటీ రచ్చ రచ్చ!
ఇదీ చదవండి: ఒకప్పడు సునీల్ అంటే నాకు ఇష్ట.. కానీ ఇప్పుడు నచ్చట్లేదు: హీరో వేణు