Kainakary Thankaraj: ప్రముఖ మళయాల నటుడు కైనకరి తంకరాజ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం తన నివాసంలో 77 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. తంకరాజ్ మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మమ్ముట్టి, మోహన్‌లాల్, పృధ్విరాజ్ సుకుమారన్, లిజో జోష్ పెల్లిస్సెరిలతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ రోజు సాయంత్రంలోపు తంకరాజ్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
కొల్లాంలోని కేరళపురానికి చెందిన తంకరాజ్ 1978లో వచ్చిన ‘‘అన పాచమ్’’సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అందులో ప్రేమ్ నజీర్ లీడ్ రోల్ చేశారు. ‘‘ఈ.మా.యో’’సినిమాలో వావాచాన్ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమెన్, లూసిఫర్, హోమ్ వంటి హిట్ సినిమాల్లో నటించారు. మొత్తం 35 సినిమాలు చేశారు.
ఇవి కూడా చదవండి : డ్రగ్స్ కేసులో నిహారికకు నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.