Kainakary Thankaraj: ప్రముఖ మళయాల నటుడు కైనకరి తంకరాజ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం తన నివాసంలో 77 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. తంకరాజ్ మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మమ్ముట్టి, మోహన్‌లాల్, పృధ్విరాజ్ సుకుమారన్, లిజో జోష్ పెల్లిస్సెరిలతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ రోజు సాయంత్రంలోపు తంకరాజ్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. కొల్లాంలోని కేరళపురానికి చెందిన తంకరాజ్ […]