ఈ మద్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారితో కొంత మంది చనిపోతే.. చిన్న చిన్న కారణాలకు మనస్థాపానికి గురై మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సినిమా ఆర్టిస్ట్ ఆత్మహత్య కలకలం రేపుతుంది. కాకపోతే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలంగా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉండే సైద్ రహీమ్ అనే 24ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సైద్ రహీమ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అన్న విషయం ఇంకా తెలియరాలేదు.
ఇటీవల కరోనా నేపథ్యంలో సినిమాల్లో సరైన అవకాశాలు రాక నిరుస్సాహంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రేమ విషయంలోనా? లేక సూసైడ్‌కు మరేదైనా కారణం ఉందా? అనే విషయాలపై విచారణ జరుగుతోంది.