ఇటీవల హైదరాబాద్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు 16 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే తాజాగా నగరంలో మరో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చాపకింద నీరులా ప్రవహిస్తున్న ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఉగ్రవాదులు మాత్రం అభివృద్ధి చెందిన నగరాలను టార్గెట్ చేసుకుని దొంగ చాటును దెబ్బకొడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు 16 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి హైదరాబాద్ ఇంటలిజెన్స్ పోలీసులు ఆపరేషన్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు నగరంలోని చంద్రాయణగుట్ట, బాబా నగర్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
అయితే ఈ వ్యవహారంలో ఓ ప్రొఫెసర్ సలీం అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, ఉగ్రవాద నెట్వర్క్ ను పెంచడంలో తన పాత్ర పోషించినట్లు సమాచారం. అయితే ఇతడు ఏడాది కాలంగా నగరంలో ఏకంగా నాలుగు ఇళ్లు మారినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. తాజాగా మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంతో చంద్రాయణగుట్ట, బాబా నగర్ ప్రాంతాల్లోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. హైదరాబాద్ లో వరుస ఉగ్రవాదుల అరెస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.