ఆదాయంతో పాటు ఫేమ్ రావాలంటే ఏకైక ఎంపిక సినిమా రంగం సినిమా పరిశ్రమ. కొంత సినిమా మీద ఫ్యాషన్ తో హీరో అవ్వాలనో, హీరోయిన్ కావాలనో, డైరెక్టర్ అవుదామనో ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం ఉండాల్సిందే. అవకాశాలు రాక డబ్బులు ఇవ్వకపోయిన చిన్నక్యారెక్టర్ వస్తే చాలురా బాబు అనుకునే వాళ్లు చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఇక కొంత మంది జూనియర్ ఆర్టిస్టులుగానూ, మరికొంత మంది వారిని జూనియర్ ఆర్టిస్టులను సప్తై ఏజెంట్లుగా మారిపోతారు
ఆదాయంతో పాటు ఫేమ్ రావాలంటే ఏకైక రంగం సినిమా పరిశ్రమ. కొంత సినిమా మీద ఫ్యాషన్ తో హీరో అవ్వాలనో, హీరోయిన్ కావాలనో, డైరెక్టర్ అవుదామనో ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం ఉండాల్సిందే. అవకాశాలు రాక డబ్బులు ఇవ్వకపోయిన చిన్నక్యారెక్టర్ వస్తే చాలురా బాబు అనుకుని ఎదురుచూస్తుంటారు. ఇక కొంత మంది జూనియర్ ఆర్టిస్టులుగానూ, మరికొంత మంది వారిని జూనియర్ ఆర్టిస్టులను సప్తై ఏజెంట్లుగా మారిపోతారు. అయితే సినిమా పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులకు అన్యాయం జరుగుతుందని, వారికి సరిగా డబ్బులు ఇవ్వరని ఎప్పటినుండో టాక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు మరొకరు ఇదే రకమైన ఆరోపణలు చేశారు.
నాని హీరోగా వచ్చిన మూవీ దసరా. ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా.. కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకు జూనియర్ ఆర్టిస్టులను అందించిన ఏజెంట్, సింగర్ శ్రీను సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం వర్క్ చేస్తే కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏజెంట్ శ్రీను మాట్లాడుతూ..‘ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులను చాలా చీప్ గా చూస్తారు. వచ్చేదాకా మంచిగా మాట్లాడి తీసుకెళతారు.. వెళ్ళాక కనీసం పట్టించుకోరు. కొన్ని సార్లు డబ్బులు సగం సగమే ఇస్తారు. మరికొన్ని సార్లు అస్సలు ఇవ్వరు.క్యాస్టింగ్ డైరెక్టర్లు వారికిచ్చిన డబ్బులు సమంగా పంచరు’అని చెప్పారు.
‘దసరా సినిమా కోసం 23 మందిని గోదావరిఖని వెళ్ళాను. షూటింగ్ ఉన్న వారం రోజుల పాటు అక్కడే ఉన్నాము కానీ..ఇప్పటివరకు పైసా కూడా ఇవ్వలేదు. నాకే 70 వేలు ఖర్చు అయింది. నేను తీసుకెళ్లిన వాళ్ళు నన్నే కదా అడుగుతారు. నేను కూడా మొత్తం ఇవ్వలేదు సగమే ఇచ్చాను. ఇలాంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. ఐడీ కార్డులుంటే జూ ఆర్టిస్టులకు రూ. 900, కార్టు లేని వారికి రూ. 500, ఒక్కోసారైతే రూ. 300 ఇస్తారు. నేను మాత్రం అందరికీ రూ. 900 ఇస్తాను’అని చెప్పుకొచ్చాడు శ్రీను. తాను చాలా సీరియల్స్, సినిమాలకు బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుగానూ పనిచేశానని చెప్పారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.