ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా పేరు మారుమ్రోగిపోతోంది. దానికి కారణం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇక రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR.. వరల్డ్ వైడ్ గా ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో మనందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు తమ నట విశ్వరూపాన్నే చూపారని చెప్పాలి. అందుకే ట్రిపుల్ ఆర్ మూవీ కు అవార్డులు వెళ్లువెత్తుతున్నాయి. ఇక ఈ సినిమాకు వెస్ట్రన్ మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు. దాంతో రామ్ చరణ్ త్వరలోనే హాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు అనే వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. తాజాగా మరో వార్త ప్రస్తుతం షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? బ్లాక్ పాంథర్ గా యంగ్ టైగర్ నటించబోతున్నారు అని. దీనికి సంబంధించి మార్వెల్ యూనివర్స్ ఇప్పటికే ఎన్టీఆర్ తో చర్చలు జరిపినట్లు పరిశ్రమ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాత నందమూరి తారకరామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని టాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు. యక్టింగ్ కి పవర్ హౌజ్ లాంటి ఎన్టీఆర్ జక్కన తెరకెక్కించిన RRRలో తన నట విశ్వరూపాన్నే చూపాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీముడి పాత్రకు మంత్ర ముగ్ధులు అయ్యారు వెస్ట్రన్ మూవీ లవర్స్. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో జంతువులతో కలిసి దాడి చేసే సీన్ అయితే నెక్ట్స్ లెవన్ అని హాలీవుడ్ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సీన్ హాలీవుడ్ సీన్లకు ఏ మాత్రం తీసిపోదని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తారక్ కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ను నెక్ట్స్ రేంజ్ లో చూపించడానికి మార్వెల్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా నాటు నాటు సాంగ్ కు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ అవార్డు ఫంక్షన్ కు హాజరు అయిన తారక్ కు రిపోర్టర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. మీరు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంటర్ అవుతున్నారా? బ్లాక్ పాంథర్ గా నటించబోతున్నారా? అన్న ప్రశ్నకు తారక్ సమాధానం ఇస్తూ..వెయిటింగ్ ఫర్ ఏ కాల్ అని తారక్ ఆన్సర్ ఇచ్చినట్లు సమాచారం. ఇక చాడ్విక్ బోస్మేన్ చనిపోయిన తర్వాత బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ కు కరెక్ట్ గా, అంత ఫర్ ఫెక్ట్ గా సూట్ అయ్యా హీరో దొరకలేదు. ఎన్టీఆర్ అయితే ఆ పాత్రలో ఉన్న ఎమోషన్స్ కరెక్ట్ గా పండిస్తాడని అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. తనకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ‘టోనీ స్టార్క్’ పాత్ర అంటే చాలా ఇష్టం అని గతంలో తారక్ చెప్పుకొచ్చారు.
#JrNTR #RRRMovie is making us proud! @tarak9999 at the Red carpet of #GoldenGlobes2023 ! The world is cheering for our Indian Film! 🔥❤️ #RRR #SiddharthKannan #SidK pic.twitter.com/2b9OlgGqQ0
— Siddharth Kannan (@sidkannan) January 11, 2023