ఇండస్ట్రీలో 'ఒక దెబ్బకు రెండు పిట్టలు' అనే పాపులర్ సామెత తాలూకు సన్నివేశాలు చాలా రేర్ గా జరుగుతుంటాయి. టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో అదే జరిగినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. ఆ సినిమా వరల్డ్ వైడ్ పాపులర్ అవ్వడం, ఆస్కార్ గెలవడంతో గ్లోబల్ స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.
ఆర్ఆర్ఆర్.. 95వ ఆస్కార్ వేడుకలలో అవార్డు అందుకొని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వరించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఓ స్పెషల్ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా పేరు మారుమ్రోగిపోతోంది. దానికి కారణం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇక రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR.. వరల్డ్ వైడ్ గా ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో మనందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు తమ నట విశ్వరూపాన్నే చూపారని చెప్పాలి. అందుకే ట్రిపుల్ ఆర్ మూవీ కు అవార్డులు వెళ్లువెత్తుతున్నాయి. ఇక ఈ సినిమాకు వెస్ట్రన్ మూవీ లవర్స్ […]