ఇండస్ట్రీలో 'ఒక దెబ్బకు రెండు పిట్టలు' అనే పాపులర్ సామెత తాలూకు సన్నివేశాలు చాలా రేర్ గా జరుగుతుంటాయి. టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో అదే జరిగినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. ఆ సినిమా వరల్డ్ వైడ్ పాపులర్ అవ్వడం, ఆస్కార్ గెలవడంతో గ్లోబల్ స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.
సినీ ఇండస్ట్రీలో ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అనే పాపులర్ సామెత తాలూకు సన్నివేశాలు చాలా రేర్ గా జరుగుతుంటాయి. టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ విషయంలో అదే జరిగినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా.. ఆ సినిమా వరల్డ్ వైడ్ పాపులర్ అవ్వడం, ఆస్కార్ గెలవడంతో గ్లోబల్ స్టార్డమ్ సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్, చరణ్. ఇప్పుడు ఫ్యూచర్ సినిమాలను ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలిచిన తర్వాత ఎన్టీఆర్ క్రేజ్.. అమాంతం ప్రపంచదేశాలకు పాకేసిందని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ తో అటు హీరోలకు, ఇటు ఇండియన్ సినిమాకి వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చిపెట్టాడు దర్శకుడు రాజమౌళి. ఆస్కార్ గెలిచాక అన్ని దేశాలు ఇండియన్ సినిమా గురించి చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎక్కువగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే.. కొన్నాళ్లుగా ఎన్టీఆర్ హాలీవుడ్ లో ఫలానా సినిమా చేయబోతున్నాడు అని వార్తలు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్.. జేమ్స్ బాండ్ సిరీస్ లోకి వస్తున్నాడని.. లేదు లేదు ఎన్టీఆర్ మార్వెల్ సిరీస్ లోకి ఎంటర్ కాబోతున్నాడని రూమర్స్ కూడా గట్టిగా వినిపించాయి.
ఇలాంటి తరుణంలో వరల్డ్ వైడ్ మార్కెట్ ఉన్నటువంటి మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్ నటించనున్నాడని టాక్ బాగా వినిపిస్తోంది. అంతేగాక ఎన్టీఆర్ బ్లాక్ పాంథర్ లోకి రానున్నాడంటూ.. ఓ అభిమాని షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘బ్లాక్ పాంథర్: వాకండా ఫరేవర్’కి సంబంధించిన పోస్టర్ షేర్ చేసి.. అందులో కింగ్ టి’చల్లా కుమారుడు ప్రిన్స్ టి’చల్లా క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటిస్తాడని రాసుకొచ్చారు. ప్రెజెంట్ ఈ పోస్ట్ చూస్తూ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా బ్లాక్ పాంథర్ లో ఎన్టీఆర్.. నిజంగా ఆ ఊహ ఎంత బాగుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే చాలా బాగుంటుందని మార్వెల్ స్టూడియోస్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి బ్లాక్ పాంథర్ లోకి ఎన్టీఆర్ వస్తే ఎలా వుంటుందో సరదాగా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
#JRNTR @tarak9999 as Toussaint aka Prince T’Challa @MarvelStudios @Marvel, Best choice across the world.
Black Panther – Reclaim. https://t.co/E1138eXU8D— Pavan Kumar (@PavanKu40745116) March 14, 2023